నోట్ల ర‌ద్దుతో టోకు ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గుముఖం, రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం రెండేళ్ల క‌నిష్టానికి

నోట్ల ర‌ద్దుతో టోకు ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గుముఖం,రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం రెండేళ్ల క‌నిష్టానికి కూరగాయల ధరలు, ఇతరత్రా వంట సరకుల ధ‌ర‌లు త‌గ్గ గత నెల టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) దిగివచ్చింది. నవంబర్‌లో

కూరగాయల ధరలు, ఇతరత్రా వంట సరకుల ధ‌ర‌లు త‌గ్గుముఖంతో గత నెల టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) దిగివచ్చింది. నవంబర్‌లో 3.15 శాతంగానే నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం వ‌రుస‌గా మూడో నెలా త‌గ్గింది. నిరుడు నవంబర్‌లో మైనస్ 2.04 శాతంగా ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 3.39 శాతంగా ఉంది.

నోట్ల ర‌ద్దుతో టోకు ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గుముఖం, రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం రెండేళ్ల క‌నిష్టానికి

మరోవైపు రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా త‌గ్గిన సంగ‌తి తెలిసిందే. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెల నవంబర్‌లో రెండేళ్ల కనిష్ట స్థాయిని తాకి 3.63 శాతంగానే నమోదైంది. 2014 నవంబర్‌లో 3.23 శాతంగా నమోదవగా, మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయి స‌మీపానికి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు చేరాయి. ఇకపోతే వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ఈ ద్రవ్యోల్బణం అంతకుముందు అక్టోబర్ నెలలో 4.20 శాతంగా ఉన్నట్లు మంగళవారం గణాంకాలు, ప్రణాళిక అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది. కూరగాయల ధరలు 10.29 శాతం పడిపోగా, పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసం, చేపల ధరలూ తగ్గుముఖం పట్టాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించిన సంగ‌తి విదిత‌మే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+