ఉచిత ప్రమాద బీమా కావాలా? అయితే రైలులో ప్రయాణించండి
రైలు ప్రయాణికులకు ఒక శుభవార్త. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రైల్ రిజర్వేషన్ టిక్కెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టిక్కెట్ బుక్ చేసుక
రైలు ప్రయాణికులకు ఒక శుభవార్త. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రైల్ రిజర్వేషన్ టిక్కెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టిక్కెట్ బుక్ చేసుకునే యూజర్లు.. టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్యాసింజర్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ఎంపిక చేసుకున్నట్టయితే, బీమా సౌకర్యం ఆప్షన్‌ను నిర్ధారించాల్సి ఉంటుంది. డిసెంబరు 10 నుంచి ఈ సేవలను పరిమిత కాలం పాటు ఉచితంగా అందించనున్నట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్టయితే ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.0.92 పైసలు చొప్పున బీమా పాలసీకి వసూలు చేసేవారు. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏసీ రిజర్వేషన్ ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండగా, ఇపుడు సెకండ్ క్లాస్ స్లీపర్ రిజర్వేషన్ ప్రయాణికులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. నోట్ల రద్దును ప్రకటించి నెలరోజులు పూర్తయిన సందర్భంగా అరుణ్‌జైట్లీ కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించారు. అందులో భాగంగా రైల్వే ఉచిత ప్రమాద బీమా గురించి సైతం చెప్పారు. ఎవరైనా ఈ బీమాను తీసుకుంటే ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత వైకల్యానికి గురైనా రూ. 10 లక్షల బీమా హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. పాక్షిక వైకల్యానికి గురైతే రూ. 7.5 లక్షలు బీమాదారుడికి చెల్లిస్తారు. అదే విధంగా ఆసుపత్రి ఖర్చుల కోసం రూ. 2 లక్షలను చెల్లిస్తారు. దహన సంస్కారాల కోసం రూ. 10 వేల రూపాయలను అందిస్తారు. రైల్వే అధికారుల లెక్కల ప్రకారం రోజుకు 14 లక్షల మంది రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. ఇందులో 58% ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications