అమెరికాలోని యువ పారిశ్రామికవేత్తల్లో 40 సంవత్సరాల్లోపు వయసున్నవారితో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాది జాబితా రూపొందించింది. ఇలా రూపొందించడం రెండో సారి. ఈ వార్షిక జాబితాలో ఇద్దరు ప్రవాస భారతీయులు చోటు దక్క
అమెరికాలోని యువ పారిశ్రామికవేత్తల్లో 40 సంవత్సరాల్లోపు వయసున్నవారితో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాది జాబితా రూపొందించింది. ఇలా రూపొందించడం రెండో సారి. ఈ వార్షిక జాబితాలో ఇద్దరు ప్రవాస భారతీయులు చోటు దక్కించుకున్నారు.. ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు అగ్రస్థానంలో నిలిచిన ఫోర్బ్స్ యువ పారిశ్రామిక వేత్తల జాబితాలో ప్రవాస భారతీయుల ప్రభంజనం ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.

జాబితాలో మనోళ్లు ఇద్దరు
31 ఏళ్ల బయోటెక్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి 600 మిలియన్ డాలర్ల సంపదతో 24వ స్థానాన్ని సాధించగా, 30 ఏళ్ల ఇన్‌స్టాకార్ట్ సహవ్యవస్థాపకుడైన అపూర్వ మెహతా 360 మిలియన్ డాలర్లతో 31వ స్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్‌బర్గ్ 50 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. 40 మందితో తయారైన ఈ జాబితాల్లో ఇద్దరు మహిళలూ ఉండగా, చివరి రెండు స్థానాల్లో వారున్నారు. ప్రముఖ బాక్సర్ ఫ్లాయిడ్ మెవెదర్, పాప్‌గాయని బియాన్సీ, సినీ నటి జెస్సికా ఆల్బా, ఇన్‌స్టాగ్రామ్ సహ వ్యవస్థాపకుడు కెవిన్‌లకూ మొదటిసారి జాబితాలో చోటు దక్కింది.

వివేక్ రామస్వామి
రోయివాంట్ సైన్సెస్ వ్యవస్థాపకుడయిన రామస్వామి హార్వర్డ్, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లలో చదువుకున్నారు. ఆయన నికర సంపద దాదాపు రూ. 4 వేల కోట్లుగా ఉంది. ఈ ఫోర్బ్స్ జాబితాలో 24 వ స్థానం దక్కించుకున్నారు. బయోటెక్నాలజీ రంగంలో స్వామికి మంచి అనుభవం ఉంది. ఆయన నేతృత్వంలోని ఎక్సోవాంట్ గత ఏడాది అమెరికా బయోటెక్నాలజీ చరిత్రలోనే అతి పెద్ద మొదటి పబ్లిక్ ఆఫర్‌కు వచ్చినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.

అపూర్వ మెహతా
యూనివర్సిటీ ఆఫ్ వాటర్‌లూ నుంచి పట్టభద్రుడైన 30 ఏళ్ల మెహతా ఈ ఏడాది తన సంపదను పెంచుకున్నారు. రూ. 2400 కోట్ల సంపదనను కలిగి ఉండటం ద్వారా ఫోర్బ్స్ యంగ్ యెంటర్‌ప్రెన్యూర్స్ జాబితాలో 31వ స్థానంలో నిలిచారు. 2012లో పచారి సామాగ్రిని ఇంటి వద్దకే అందించే ఇన్‌స్టాకార్ట్‌ను ప్రారంభించారు. 10 డాలర్ల కంటే తక్కువ రుసుముతోనే ఈ సేవలు అందిస్తున్నట్లు ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడించింది. అంతకుముందు బ్లాక్‌బెర్రీ, క్వాల్‌కామ్, అమెజాన్ వంటి సంస్థల్లో ఆయన తన అనుభవాన్ని కలిగి ఉన్నారు.

ఫోర్బ్స్ మ్యాగజైన్ గురించి
ఫోర్బ్స్ మ్యాగజైన్ డిజిటల్ విభాగానికి సంబంధించి ఫోర్బ్స్.కామ్ ప్రసిద్ది చెందింది. ఈ సంస్థ వెబ్‌సైట్లన్నీ కలిసి నెలకు 2 కోట్ల 70 లక్షల మంది విజిటర్లను చేరుకుంటాయి. 2009 టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఫోర్బ్స్ వార్షిక రెవెన్యూ 70 మిలియన్ డాలర్ల నుంచి 80 మిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. బీసీ ఫోర్బ్స్ 1917లో ఫోర్బ్స్ మ్యాగజైన్‌ను స్థాపించారు. ఫోర్బ్స్ ప్రధాన కార్యాలయం న్యూజెర్సీలోని
డౌన్‌టౌన్‌లో ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications