ఈ దేశాలు న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ వైపు ప్ర‌య‌త్నించాయ్‌

నోట్ల ర‌ద్దు వ‌ల్ల క‌లిగే లాభ, నష్టాలపై లోతుగా అధ్య‌యనం చేసి మరీ ఆచరణలోకి తీసుకురావడం వెనుక బలమైన వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మ‌న కంటే ముందు నోట్ల ర‌ద్దు,న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ దిశ

ప్ర‌స్తుతం దేశం మొత్తం అంద‌రూ చ‌ర్చిస్తున్నఅంశం పెద్ద నోట్ల గురించే. నవంబ‌రు 8 నుంచి రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో బడాబాబుల సంగతేమోగానీ సామాన్యులు మాత్రం అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. వీట‌న్నింటి గురించి ప్ర‌భుత్వం ముందే అంచ‌నా వేసింది. అయినా ఈ నిర్ణ‌యానికే ఎందుకు మొగ్గుచూపింది అనే సందేహం రావొచ్చు. స్వ‌ల్ప‌కాలంలో వ‌చ్చే ఇబ్బందుల కంటే దీర్ఘ‌కాలంలో లాభాలుంటాయ‌ని భావించి న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం పెద్ద నోట్ల ర‌ద్దుకే మొగ్గుచూపింది. నోట్ల ర‌ద్దు వ‌ల్ల క‌లిగే లాభ, నష్టాలపై లోతుగా అధ్య‌యనం చేసి మరీ ఆచరణలోకి తీసుకురావడం వెనుక బలమైన వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మ‌న కంటే ముందు నోట్ల ర‌ద్దు, న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ దిశ‌గా సాగుతున్న వివిధ దేశాల గురించి తెలుసుకుందాం.

స్వీడ‌న్‌:

స్వీడ‌న్‌:

న‌గ‌దు లావాదేవీల‌ను బాగా త‌గ్గించిన దేశాల్లో ముందు వ‌రుస‌లో ఉన్న దేశం స్వీడ‌న్‌. మొత్తం ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో న‌గ‌దు లావాదేవీలు 3 శాతం ఉన్నాయి. బ‌స్సు టిక్కెట్ కావొచ్చు, సూప‌ర్ మార్కెట్ కొనుగోళ్లు కావొచ్చు ఏదైనా కార్డుతోనే జ‌రుపుతారు ఆ దేశ‌ ప్ర‌జ‌లు. వీలైన ప్ర‌తిచోటా ఆన్‌లైన్ బ్యాంకింగ్ జ‌రిపేందుకు ఆ దేశ ప్ర‌జ‌లు మొగ్గుచూపుతారు. ప్ర‌భుత్వం తీసుకున్న వివిధ చ‌ర్య‌ల మూలంగా ఆ దేశంలో దొంగ‌త‌నాలు సైతం త‌గ్గాయ‌ని తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. 2008లో ఏడాదికి 110గా ఉన్న దొంగ‌త‌నాలు 2011 ఏడాదికి 16కు త‌గ్గాయి. అస‌లు న‌గ‌దు వాడ‌క‌మే లేక‌పోవ‌డ‌మే ఈ మార్పుకు ప్ర‌ధాన కార‌ణం.

డెన్మార్క్‌:

డెన్మార్క్‌:

ఈ దేశంలో న‌గ‌దు లావాదేవీలు జ‌రిపేందుకు మూడింట ఒక శాతం ప్ర‌జ‌లు మొబైల్ యాప్ "మొబైల్‌పే"ను ఉప‌యోగిస్తారు. వ‌స్త్ర వ్యాపారులు, రెస్టారెంట్ల నిర్వాహ‌కులు, పెట్రోలు బంకులు న‌డిపేవారు మొద‌లైన‌వారు వినియోగ‌దారుల నుంచి న‌గ‌దు పేమెంట్ల‌ను తిరస్క‌రించేందుకు చ‌ట్ట‌ప‌రంగా ఆస్కారం ఉంద‌క్క‌డ‌. అయితే ఆస్ప‌త్రుల్లో, త‌పాలా కార్యాల‌యాల్లో న‌గ‌దును తిర‌స్క‌రించే వీల్లేదు.

బెల్జియం:

బెల్జియం:

మ‌న దేశంలో ఒక రాష్ట్రం విస్తీర్ణం క‌లిగిన దేశం బెల్జియం. యూర‌ప్ ఖండంలో భాగ‌మైన ఈ దేశ జ‌నాభా దాదాపుగా 1 కోటి 12 ల‌క్ష‌లు. ఇక్క‌డ 93 శాతం మంది ప్ర‌జ‌లు న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ దిశ‌గా క‌దులుతున్నారు. 86 శాతం జ‌నాభాకు డెబిట్ కార్డులున్నాయి. అంతే కాకుండా ప్ర‌భుత్వం 3వేల‌కు పైబ‌డిన చెల్లింపుల‌కు న‌గ‌దు మీద ఆంక్ష‌లు విధించింది. అందుకే ప్ర‌జ‌లు మ‌రో గ‌త్యంత‌రం లేక న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌కు దూకుడుగా ముందుకెళ్లారు. బెల్జియ‌న్ బ్యాంకుల మ‌ద్ద‌తు క‌లిగిన మొబైల్ యాప్ 'సిక్స్‌డాట్స్‌'ను ఎక్కువ‌గా ప్ర‌జ‌లు వాడుతున్నారు.

పాకిస్తాన్:

పాకిస్తాన్:

2015 జూన్ లో పాకిస్తాన్ రూ.5, రూ.500 నోట్లను రద్దు చేసింది. మార్చుకోవడానికి ఏడాదిన్నర సమయం ఇచ్చింది. అది ఈ ఏడాది డిసెంబర్ 1తో ఆ గ‌డువు పూర్తికానుంది. కానీ, పాక్ సర్కారు ఏ ఉద్దేశ్యంతో దీన్ని అమల్లోకి తెచ్చిందో గానీ, ఏడాదిన్నర సమయం ఇవ్వడం వల్ల నల్లధనం ఏ మాత్రం తగ్గే అవకాశం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇంత సుదీర్ఘ సమయంలో నల్లధనాన్ని సులభంగా తెల్ల‌గా మార్చుకోవడానికి ఎన్నో మార్గాలను వెతుక్కోవచ్చు.

కాంగో (జైరే):

కాంగో (జైరే):

ఈ దేశ నియంత పాలకుడు మొబుటు పెద్ద నోట్ల ర‌ద్దును 1990లో ప్రకటించాడు. 1970లో స్వాతంత్ర్యం రాగా, విదేశీ నిధులకు కటకట ఏర్పడింది. దీంతో ఆర్థిక అస్థిరతకు దారితీసింది. ఫలితంగా డీమోనటైజేషన్ నిర్ణయాన్ని తీసుకురాగా అది విజయవంతం కాలేదు. ఆర్థిక సమస్యల నుంచి 2000 సంవత్సరం తర్వాత‌ గానీ ఆ దేశం కోలుకోలేదు.

జింబాబ్వే:

జింబాబ్వే:

2010లో డీమోనటైజేషన్ నిర్ణయాన్ని ప్రకటించింది. 100 ట్రిలియన్ జింబాబ్వే డాలర్ల నోట్లను ఆ దేశం ముద్రించింది. వీటి విలువ కేవలం 40 సెంట్లు మాత్రమే. కానీ, డీమోనటైజేషన్ విఫలం అయింది. దీంతో తన దేశ కరెన్సీ స్థానంలో అమరికా డాలర్ ను అమల్లోకి తెచ్చింది. ఒక ద‌శ‌లో జింబ్వాబ్వే ద్ర‌వ్యోల్బ‌ణం 200 శాతం వ‌ర‌కూ వెళ్లింది.

అమెరికా:

అమెరికా:

దేశంలో ఉన్న నల్లధనం ఏరివేతకు వీలుగా అమెరికాలో 1969లో అప్పటి అధ్యక్షుడు రిచర్జ్ నిక్సన్ డీమోనటైజేషన్ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. ఇది విజయవంతమైంది. అమెరికాలో ప్ర‌జ‌లు జ‌రిపే లావాదేవీల్లో 80 శాతం న‌గ‌దు ర‌హితంగా జ‌రుగుతున్నాయి. 72 శాతం మంది డెబిట్ కార్డులు క‌లిగి ఉన్నారు.

ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియా:

1996లో డీమోనటైజేషన్ నిర్ణయాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. నల్లధనం నివారణతోపాటు నోట్లను అధిక భద్రతా సదుపాయాలతో తీసుకువచ్చేందుకు డీమోనటైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇదే సమయంలో పేపర్ నోట్ల స్థానంలో దీర్ఘకాలం పాటు మన్నే పాలీమర్ ఆధారిత నోట్లను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతం అయింది. వ్యాపార అనుకూల దేశంగా ఆస్ట్రేలియాను మార్చింది.

ఉత్తరకొరియా:

ఉత్తరకొరియా:

టూ జీరోయెస్ నోట్లను వ్యవస్థ నుంచి రద్దు చేసింది. నల్లధనాన్ని నిర్మూలించి ఆర్థిక రంగాన్ని కట్టుదిట్టం చేసేందుకు ఈ నిర్ణయాన్ని అమలు చేసింది. అయితే, ఈ కార్యక్రమం విజయం సాధించలేదు. ద్రవ్యోల్బణం పెరిగిపోయి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. దీంతో నియంత పాలకుడైన కిమ్ జాంగ్ ఇల్ ప్రజలకు క్షమాపణ చెప్పారు.

నైజీరియా:

నైజీరియా:

1984లో ముహమ్మద్ బుహారి ఆధ్వర్యంలోని సర్కారు నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్థిక వ్యవస్థ మెరుగునకు తీసుకున్న ఈ నిర్ణయం ఆచరణలో విఫలమైంది. 1985-86 కాలంలో బుహారి అధికారాన్ని కూడా కోల్పోయారు.

కెన్యా:

కెన్యా:

కెన్యాలో ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టేందుకు ఉపకరిస్తున్న మొబైల్ వ్యాలెట్ సంస్థ ఎమ్-పెసా లావాదేవీల ప‌రంగా ఆ దేశ స్వ‌రూపాన్ని మార్చివేసింది. ఆ దేశంలో ప్రతి ఇంట్లో అంద‌రూ దాన్ని వాడేందుకు అల‌వాటు ప‌డిపోయారు. ప్ర‌తి చోటా చెల్లింపుల కోసం ప్రతి వ్యక్తికి అది పరిచయమైపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే అది వారి దైనందిన జీవితంలో ఓ భాగంగా ఉంది. సిగ‌రెట్ కొనుగోలు నుంచి ఫ‌ర్నిచ‌ర్ కొనుగోలు దాకా మొబైల్ ద్వారా చెల్లించి త‌మ‌కు కావ‌ల్సింది కొనుక్కోవచ్చు. అందుకోసం ఎక్కడికక్కడ ఎం-పెసా దుకాణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ఖాతా తెరిచే వెసులుబాటు కల్పించింది. 2007 నుంచి ఈ సంస్థ అక్క‌డ సేవలు అందిస్తూ ఉంది. అక్కడి ప్రభుత్వం దానికి మద్దతు ఇచ్చింది. ‘సఫారీ.కామ్' ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో ఇది అందుబాటులోకి వచ్చింది. 2008 నాటికి 27 ల‌క్ష‌ల మంది ఖాతాదారులు, 3వేలమంది ఏజెంట్లతో సేవలందించిన ‘ఎమ్-పెసా' ఇప్పుడు 1 కోటి 46 లక్ష‌ల‌ మంది ఖాతాదారులతో పనిచేస్తోంది. సెకనుకు 80 లావాదేవీలు నిర్వహిస్తోంది. ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 31శాతం వాటా ఈ ఒక్క సంస్థ చెల్లింపులతో లభ్యమవుతోందంటే అది ఎంత‌గా విస్త‌రించిందో అర్థం చేసుకోవ‌చ్చు. 33.62 బిలియన్ల యుఎస్ డాలర్ల మొత్తం లావాదేవీలు నిర్వహిస్తోంది. ఇదంతా కేవలం మొబైల్ బ్యాంకింగ్‌తోనే. పెద్ద విజయం కదా!. అందుకే నైజీరియా సహా ఎన్నో దేశాలు, అక్కడి ప్రభుత్వాలు ‘ఎమ్-పెసా' విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని కొత్తకొత్త విధానాలను అమలు చేస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+