ఎయిర్‌టెల్ ఖాతాదారులకు 100 నిమిషాల ఉచిత టాక్ టైం!
ఇటీవల ఎన్ని రూపాయలు డిపాజిట్ చేస్తే అన్ని నిమిషాల టాక్ టైం ఫ్రీ అని ప్రకటించిన పే మెంట్ బ్యాంకు తాజాగా మంగళవారం మరో ఆఫర్ను ప్రకటించింది.తమ బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపిన ఎయిర్ టెల్ ఖాతాదారులకు 100
ఇటీవల ప్రతిష్మాత్మకంగా ప్రారంభమైన ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఒక వైపు ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలపై విపరీతమైన ప్రచారం కల్పిస్తుండగా, మరోవైపు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఈ-చెల్లింపులను భారీగా ప్రోత్సాహిస్తోంది. ఇటీవల ఎన్ని రూపాయలు డిపాజిట్ చేస్తే అన్ని నిమిషాల టాక్ టైం ఫ్రీ అని ప్రకటించిన పే మెంట్ బ్యాంకు తాజాగా మంగళవారం మరో ఆఫర్ ను ప్రకటించింది. తమ బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపిన ఎయిర్ టెల్ ఖాతాదారులకు 100 నిమిషాల మొబైల్ టాక్ టైంను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. తమ బ్యాంకు ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిపిన వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా ఈ ఆఫర్ అందించనున్నట్టు పే మెంట్ బ్యాంక్ తెలిపింది ప్రతీనెలా సుమారు లక్షమంది ఖాతాదారులకు వంద నిమిషాల టాక్ టైం ను ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించింది.

నగదు రహిత ఆర్థిక వ్యవస్థవైపు భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు తమ బ్యాంకు ప్రయత్నాలు దోహదం చేస్తాయని బ్యాంక్ సీఈవో , ఎండీ శశి అరోరా తెలిపారు. ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా' విజన్ కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. భారతదేశం అంతటా 2017 జనవరి నెల నుంచి మరికొన్ని ఆఫర్లు అందించనున్నట్టు తెలిపారు.


Click it and Unblock the Notifications