ట్రంప్ వ్యాఖ్యలతో బేర్‌మన్న దేశ ఐటీ షేర్లు. 200 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్
హెచ్1బీ వీసాలపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు ఐటీ షేర్లు బేర్‌మన్నాయి. ఈ ప్రభావం మొత్తం సూచీలపై పడటంతో ఈరోజు మార్కెట్లు దిగాలు పడ్డాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో ఐటీ
హెచ్1బీ వీసాలపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు ఐటీ షేర్లు బేర్‌మన్నాయి. ఈ ప్రభావం మొత్తం సూచీలపై పడటంతో ఈరోజు మార్కెట్లు దిగాలు పడ్డాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో ఐటీ దిగ్గజ కంపెనీలు కుప్పకూలాయి. ఐటీ కంపెనీ షేర్ల పతనంతో సోమవారం మార్కెట్లూ బలహీనంగానే ప్రారంభమయ్యాయి. సోమవారం సెన్సెక్స్ 232 పాయింట్లు నష్టపోయి 26,515 వద్ద ముగియగా నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 8,171 వద్ద స్థిరపడింది.

వీసా దుర్వినియోగాలకు సంబంధించి వచ్చిన అన్ని రకాల అభియోగాలపై తాను అధికారం చేపట్టిన అనంతరం విచారణ జరిపిస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ట్రంప్ పాలనలో భారతీయులు సహా విదేశీయుల కార్మిక వీసాలకు సంబంధించి కఠినమైన పరిశీలనను కంపెనీలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లపై తీవ్రంగా ప్రభావం పడింది. అమెరికాలో కంపెనీ శాఖలు కలిగిన సంస్థలపై బాగా ప్రభావం పడింది.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటంతో చమురు మార్కెటింగ్ కంపెనీస్ షేర్లు అలాగే అనుబంధంగా ఆటోమొబైల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా కనిపించింది. ఇటు ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ రంగం షేర్లలోను అమ్మకాలు కనిపించాయి. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, గెయిల్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, హీరోమోటార్ కార్ప్స్, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, అదానీపోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఏసియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, తదితర షేర్లు నష్టపోయాయి.


Click it and Unblock the Notifications