ఈ ఏడాదితో పోలిస్తే 2017లో ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల తక్కువగా ఉండొచ్చని ఓ నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు 10.3 శాతం పెరగ్గా, వచ్చే ఏడాది సగటున 10శాతం మేర మాత్రమే పెరగొచ్చని తెలుస్
ఈ ఏడాదితో పోలిస్తే 2017లో ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల తక్కువగా ఉండొచ్చని ఓ నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు 10.3 శాతం పెరగ్గా, వచ్చే ఏడాది సగటున 10శాతం మేర మాత్రమే పెరగొచ్చని తెలుస్తోంది. ద్రవ్యోల్బణాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంటే ఈ పెరుగుదల 4.8 శాతంగా మాత్రమే ఉండగలదని ఆ నివేదిక పేర్కొంది. ఉద్యోగుల వేతనాల పెరుగుదల 10శాతం మేర ఉంటుందని, అయితే వాస్తవ పెరుగుదల కేవలం 4.8 శాతంగానే ఉంటుందని కోమ్ ఫెర్రీ హే గ్రూపు 2017 సంవత్సరానికి వేతనాల పెరుగుదలపై రూపొందించిన అంచనా నివేదిక వెల్లడించింది. ఇది కూడా చదవండి ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయానికి 8 మార్గాలు

ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో వేతనాల పెరుగుదల ఇప్పటికీ ఎక్కువగానే ఉంటుందని, అయితే మొత్తంమీద వేతనాల పెరుగుదల స్థిరీకరించాయని, రాబోయే రెండేళ్లలో 9.5-10.5 శాతం మధ్య ఉంటుందని కోమ్ ఫెర్రీ హే గ్రూపు కంట్రీ మేనేజర్ అమర్ హలీమ్ తెలిపారు. కింది స్థాయి ఉద్యోగుల వేతనాల పెరుగదల ఎక్కువగా ఉండవచ్చని, ఆసియా దేశాలతో సహా మిగతా దేశాలతో పోలిస్తే ఈ స్థాయి ఉద్యోగుల వేతనాలు మన దేశంలో కాస్త తక్కువగా ఉన్నాయని హలీమ్ చెప్పారు.కాగా, ఆసియాలో వేతనాల పెరుగుదల 6.1 శాతం మేర ఉండొచ్చని, గత ఏడాదితో పోలిస్తే ఇది 0.3 శాతం తక్కువని, అయితే వాస్తవ పెరుగుదల 4.3 శాతం ఉండవచ్చని కూడా ఆ నివేదిక తెలిపింది. వియత్నాం, థాయిలాండ్, ఇండోనేసియా లాంటి దేశాల్లో వాస్తవ వేతనాల పెరుగుదల అధికంగా ఉండొచ్చని ఆ నివేదిక పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా సగటున ఉద్యోగుల వేతనాల పెరుగుదల 2.3 శాతం మేర ఉంటుందని, గత సంవత్సర అంచనా 2.7 శాతంతో పోలిస్తే ఇది కాస్త తక్కువ అని ఆ నివేదిక తెలిపింది.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications