457 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, నెలరోజుల గరిష్టానికి మార్కెట్లు!
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాల ప్రభావం కారణంగా గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి ఎక్స్చేంజీ సెన్సెక్స్ 457 పాయింట్లు లాభపడి 26,694 వద్ద ముగియగా, నిఫ్టీ 145 ప
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాల ప్రభావం కారణంగా గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి ఎక్స్చేంజీ సెన్సెక్స్ 457 పాయింట్లు లాభపడి 26,694 వద్ద ముగియగా, నిఫ్టీ 145 పాయింట్ల లాభంతో 8,247 వద్ద స్థిరపడింది.

దాదాపు అన్ని సెక్టార్ల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, మెటల్ షేర్లు దూసుకెళ్లాయి. మారుతి సుజుకి, హీరోమోటార్ కార్ప్స్, బజాజ్ ఆటో, టాటా షేర్లు భారీగా లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ , ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, రిలయన్స్, సిప్లా, డా. రెడ్డీస్ ల్యాబ్స్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్, ఐటీసీ, లుపిన్ తదితర షేర్లు లాభాల్లో కొనసాగాయి అయితే ఎన్టీపీసీ షేర్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.

ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా, లోహ, వాహన, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు 3-1.3 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో మూడు షేర్లు మాత్రమే నష్టపోగా... ఇన్ఫ్రాటెల్ 2.4 శాతం క్షీణించింది. ఐషర్ 0.4 శాతం, అరబిందో 0.2 శాతం చొప్పున నీరసించాయి. మరోవైపు టాటా స్టీల్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, ఐటీసీ, హీరోమోటో, జీ, బాష్, మారుతీ 5-2.5 శాతం మధ్య లాభపడ్డాయి.
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 67.34 వద్ద స్థిరపడింది.


Click it and Unblock the Notifications