నగదు రహిత వ్యవస్థకు సిద్దమవుతున్న భారతీయ రైల్వే
కేంద్ర ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా భారతీయ రైల్వే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తోంది. డిసెంబరు 31 లోపు తమ రిజర్వేషన్ కౌంటర్లలో 15 వేల పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్స్) యంత్రాలన
కేంద్ర ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా భారతీయ రైల్వే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తోంది. డిసెంబరు 31 లోపు తమ రిజర్వేషన్ కౌంటర్లలో 15 వేల పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్స్) యంత్రాలను సరఫరా చేయాల్సిందిగా ఇండియన్ రైల్వేస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐలను కోరింది. రైల్వే ప్రయాణ టిక్కెట్ల బుకింగ్ డిజిటల్ దిశగా మార్చేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి కౌంటర్లలో కార్డులతో చెల్లింపులు జరిపేందుకు ఎటువంటి పీవోఎస్‌లు రైల్వేల వద్ద లేవు.

రోజువారీ లావాదేవీలను బట్టి 12 వేల కౌంటర్లలో పీవోఎస్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. రైల్వే యంత్రాంగానికి సైతం పెద్ద ఎత్తున నగదు నిర్వహణ కష్టమే. ఈ క్రమంలో సరిపడా స్వైపింగ్ యంత్రాలు ఉండటం వల్ల వారికి సైతం మంచిదేనని రైల్వే బోర్డు అధికారి ఒకరు తెలిపారు. మొదటి దశలో పట్టణ ప్రాంత కౌంటర్లలో పీవోఎస్‌లను అందుబాటులోకి తీసుకువస్తారు. అదే విధంగా రైల్వే మంత్రిత్వ శాఖ సైతం వెండార్ల, కాంట్రాక్టర్ల చెల్లింపుల కోసం నగదు రహిత వ్యవస్థను తీసుకువస్తుందని సమాచారం. తమ అధికారులకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆ విధంగా ఆదేశాలిచ్చారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications