అక్కడ పాత రూ. 500 నోట్లు డిసెంబరు 2 వరకే చెల్లుబాటు
పాత 500 రూపాయల నోట్ల వినియోగంపై ప్రభుత్వం కొత్తగా ఆంక్షలు విధించింది. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన పెట్రోల్ బంకుల్లో, విమాన టికెట్లు కొనుగోలు చేయడానికి ఈ నెల 2 వరకే చెల్లుబాటు అవుతాయని ప్
పాత 500 రూపాయల నోట్ల వినియోగంపై ప్రభుత్వం కొత్తగా ఆంక్షలు విధించింది. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన పెట్రోల్ బంకుల్లో, విమాన టికెట్లు కొనుగోలు చేయడానికి ఈ నెల 2 వరకే చెల్లుబాటు అవుతాయని ప్రకటించారు. ఇంతకుముందు ప్రకటించినట్టుగా ఈ నెల 15 వరకు ఉన్న గడువును కుదించినట్లుగా ప్రభుత్వం నోటిఫికేషన్‌లో వెల్లడించింది. కాగా ఈ నెల 15 వరకు స్కూలు ఫీజులు, రైల్వే టిక్కెట్లు, పౌరసేవల(యుటిలిటీ) బిల్లుల్లో విద్యుత్, నీటి బిల్లులు వంటి చెల్లింపులకు పాత 500 రూపాయల నోటును వినియోగించుకోవచ్చు.
పెద్ద నోట్ల రద్దు
అదే విధంగా టోల్ బూత్‌ల్లో డిసెంబరు 3 నుంచి పూర్తిగా పాత నోట్లను అనుమతించరు. జాతీయ రహదారులపై ఉండే టోల్ గేట్ల వద్ద పాత రూ. 500 నోట్లను అనుమతించేందకు కాస్త వెసులుబాటును కల్పించిన కేంద్రం తాజాగా దాన్ని సైతం తొలగించింది. కాబట్టి 500 కంటే తక్కువ విలువ కలిగిన నోట్ల రూపంలో కానీ లేదా కొత్త రూ. 500, రూ. 2000 నోట్లతో చెల్లింపులు చేయవచ్చు.