వరుసగా పతనమవుతున్న బంగారం ధర
బంగారం ధర క్షీణత కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి రూ.350 తగ్గి రూ.29,000లకు చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 28,635గా పలుకుతోంది. అంటే గ్రాముకు
బంగారం ధర క్షీణత కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి రూ.350 తగ్గి రూ.29,000లకు చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 28,635గా పలుకుతోంది. అంటే గ్రాముకు రూ. 15 చొప్పున పడిపోయింది. అంతర్జాతీయంగా పరిస్థితులు బలహీనంగా ఉండటం, ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం పసిడి ధరలు తగ్గేందకు కారణమయ్యాయని బంగారు వ్యాపారులు పేర్కొన్నారు. మరోపక్క వెండి ధర సైతం తగ్గింది. కిలో వెండి రూ.735 తగ్గి.. 40,700లకు చేరింది. నాణేల తయారీదారులు, పరిశ్రమల నుంచి కొనుగోళ్లు మందగించడం వెండి ధర తగ్గుదలకు కారణమైంది.
ఇది కూడా చదవండి బంగారంపై పెట్టుబడులు ఇలా...

అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలహీనత, అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచగలదన్న ఆందోళనలు బంగారం, వెండి ధరల తగ్గుదలకు మూలం అయ్యాయని బులియన్ ట్రేడింగ్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1170 డాలర్లు(1.25%) పడిపోయి 1,173 అమెరికన్ డాలర్లు పలుకుతోంది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సైతం ధర పతనానికి కారణమైందని చెపుతున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ధరలు మరింత తగ్గవచ్చనే సెంటిమెంట్ మార్కెట్‌లో బలపడుతోంది. అంతే కాకుండా ట్రంప్ తీసుకునే విధాన నిర్ణయాలు ద్రవ్యోల్బణం పెంచే విధంగా ఉంటాయని భావిస్తున్నారు. దీంతో మదుపర్లు బంగారంపై పెట్టుబడులు తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications