ఉదయం మార్కెట్లు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో ప్రారంభమవడంతో పాటు మిడ్ సెషన్ నుంచి మరింతగా లాభాలను ఆర్జించాయి. ఆర్‌బీఐ చర్యతో కన్సూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్ రంగ షేర్లు రాణించాయి. మదుప
ఉదయం మార్కెట్లు అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో ప్రారంభమవడంతో పాటు మిడ్ సెషన్ నుంచి మరింతగా లాభాలను ఆర్జించాయి. ఆర్‌బీఐ చర్యతో కన్సూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్ రంగ షేర్లు రాణించాయి. మదుపర్ల నుంచి బ్యాంకింగ్, సిమెంట్ రంగ షేర్లకు ఎక్కువ డిమాండ్ కనిపించింది. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 259 పాయింట్లు ఎగసి 26,653 వద్ద నిలవగా, నిఫ్టీ 82 పాయింట్లు ఎగసి 8,224 వద్ద స్థిరపడింది. చివరి రెండు గంటల్లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లోనే ముగిశాయి. దీంతో మార్కెట్లు రెండు వారాల గరిష్టం వద్ద ముగిశాయి.

అన్ని రంగాలూ కళకళలాడాయి
బీఎస్ఈలోని పలు రంగాల్లో కన్సూమర్ డ్యూరబుల్స్(2.46%), బ్యాంకింగ్(2.2%), క్యాపిటల్ గూడ్స్(1.57%), మౌలిక రంగం(1.19%) మేర లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా, బ్యాంక్ నిఫ్టీ అత్యధికంగా 2.2 శాతం పైకి ఎగిసింది. ఇంకా ఆటో(వాహన), ఎఫ్‌ఎంసీజీ, లోహ రంగాలు 1-0.8 శాతం మధ్య పుంజుకోవడంతో మార్కెట్లకు ప్రోత్సాహం లభించింది. బ్లూచిప్ షేర్లలో ఐసీఐసీఐ, మారుతీ, అంబుజా, యస్‌బ్యాంక్, అల్ట్రాటెక్, టాటా పవర్, ఎల్‌అండ్‌టీ, ఐషర్, గ్రాసిమ్, ఇండస్‌ఇండ్ ఎక్కువగా పెరిగాయి. అయితే మరోవైపు ఐడియా, లుపిన్, గెయిల్, జీ, ఆర్‌ఐఎల్, సిప్లా 2.7-0.7 శాతం మధ్య నీరసించాయి.
చిన్న షేర్ల జోరు
వరుసగా మూడో రోజు చిన్న షేర్ల జోరు కొనసాగింది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.1 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1762 లాభపడితే, 828 మాత్రమే నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో పేజ్, బ్లూడార్ట్, ఐబీ హౌసింగ్, ఇండియన్ బ్యాంక్, పెట్రోనెట్, ఒబెరాయ్ రియల్టీ, ఎల్‌ఐసీ హౌసింగ్, టీవీఎస్, బేయర్ క్రాప్, జీఈ టీఅండ్‌డీ, ఏబీ నువో తదితరాలు 5.5-3 శాతం మధ్య రాణించాయి.


Click it and Unblock the Notifications