సెన్సెక్స్ వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసింది. 44 పాయింట్ల లాభంతో రెండు వారాల గరిష్టానికి ఎగబాకి 26,394 పాయింట్లను తాకింది. బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్
సెన్సెక్స్ వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసింది. 44 పాయింట్ల లాభంతో రెండు వారాల గరిష్టానికి ఎగబాకి 26,394 పాయింట్లను తాకింది. బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ లాభాల బాట పట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ట్రేడింగ్‌లో43.84(0.17%) లాభపడి 26,394.01 వద్ద ముగిసింది. నవంబరు 11న సెన్సెక్స్ 26818వద్ద ముగియగా ఆ తర్వాత సెన్సెక్స్‌కు ఇదే గరిష్ట స్థాయి. ఈ రోజు ఇంట్రా డే ట్రేడింగ్లో సెన్సెక్స్ 26,587 నుంచి 26,354 మధ్య కదలాడింది. కాగా గత రెండు సెషన్లలో సెన్సెక్స్ 490 పాయింట్లు లాభపడింది.
నిప్టీ ఒక దశలో 8197 పాయింట్లను తాకిన తర్వాత ఒక దశలో 8128 కనిష్ట స్థాయికి వెళ్లింది. మార్కెట్ ముగిసే సమయానికి జాతీయ ఎక్స్జేంజీ నిఫ్టీ 15.25పాయింట్లు(0.19%) లాభంతో 8142 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో రంగాల వారీగా చూస్తే వాహన రంగం(ఆటో రంగం) అత్యధికంగా 2.2% లాభపడింది. ఇంకా కన్సూమర్ డ్యూరబుల్స్(0.93%), మౌలిక రంగం(0.29%), స్థిరాస్తి రంగం(0.26%) రాణించాయి. మరో వైపు ఐటీ సూచీ(0.51%), ఎఫ్ఎమ్‌సీజీ(0.47%), బ్యాంకింగ్(0.39%), హెల్త్ కేర్(0.17%) నష్టాల్లోకి వెళ్లాయి.
మారుతీ(3.96%), ఏసియన్ పెయింట్స్(2.17%), భారతీ ఎయిర్‌టెల్(2.11%), గెయిల్(2.07%), హీరో మోటోకార్ప్(2.05%), ఎం అండ్ ఎం మొదలైన షేర్లు లాభపడగా, యాక్సిస్ బ్యాంక్(1.59%), సన్‌ఫార్మా(1.05%), ఎన్టీపీసీ, ఐటీసీ(0.99%), టీసీఎస్(0.83%), ఇన్ఫోసిస్(0.71%) తదితర షేర్లు నష్టాలతో ముగిశాయి.


Click it and Unblock the Notifications