నోట్ల రద్దుతో వృద్దిపై ప్రభావం: ఫిచ్
పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన ఇబ్బందులు దీర్ఘకాలం పాటు కొనసాగితే దాని ప్రభావం వృద్ధిరేటు మీద కచ్చితంగా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ సంస్థ గతంలోనే వెల్లడించింది. బ్యాంకుల నుంచి నోట్లను ఉపసంహరించుకోవడం వ
పెద్ద నోట్ల రద్దు ప్రభావం దేశంలోని ప్రతి వ్యక్తి మీదా పడగా, అది మొత్తానికి దేశ ఆర్థిక ప్రగతిపై పడనుందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేస్తోంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 7.4 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గనుందని ఫిచ్ విశ్లేషించింది. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు విషయంలో చైనాను మన దేశం అధిగమించింది. 2015-16లో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం మేర అభివృద్ధి చెందింది. 2018-2019లో భారత్ 8 శాతం మేర అభివృద్ధి చెందుతుందని గత నెలలో ఫిచ్ అంచనా వేసింది. కానీ రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు కారణంగా భారత వృద్ధిరేటు 0.5 శాతం తగ్గే అవకాశం ఉందని ఫిచ్ తాజాగా తన అంచనాలను సవరించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని మాజీ ప్రధాని, ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ సైతం పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన ఇబ్బందులు దీర్ఘకాలం పాటు కొనసాగితే దాని ప్రభావం వృద్ధిరేటు మీద కచ్చితంగా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ సంస్థ గతంలోనే వెల్లడించింది. బ్యాంకుల నుంచి నోట్లను ఉపసంహరించుకోవడం వల్ల నగదు ప్రవాహం బాగా తగ్గిందని, ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు దాదాపు స్తంభించాయని ఫిచ్ తెలిపింది. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల తాత్కాలికంగా భారత ఆర్థిక వ్యవస్థకు అంతరాయం ఏర్పడిందని పేర్కొంది.


Click it and Unblock the Notifications