బులియన్ మార్కెట్లు చాలా రోజుల తర్వాత సోమవారం తెరుచుకున్నాయి. ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. బులియన్ మార్కెట్‌కు పెద్ద షాక్‌నిస్తూ 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,750 రూపాయలు క్షీణించి
బులియన్ మార్కెట్లు చాలా రోజుల తర్వాత సోమవారం తెరుచుకున్నాయి. ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. బులియన్ మార్కెట్‌కు పెద్ద షాక్‌నిస్తూ 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,750 రూపాయలు క్షీణించింది. కేవలం ఒక్కరోజే ధర ఇంతగా దిగజారడంతో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 29,400 రూపాయలకు, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 29,250 రూపాయలకు చేరాయి. వెండి సైతం కిలో 3,100 రూపాయలు తగ్గి 41,600 రూపాయలుగా ఉంది.
ఎప్పటికప్పుడు బంగారం ధరలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

బులియన్ మార్కెట్‌లో బంగారం, ఆభరణాల దుకాణాలు ఈ నెల 11 నుంచి మూతపడినది తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అక్రమార్కులు తమ అవినీతి సంపదను దారి మళ్లించేందుకు బంగారం కొనుగోళ్లను జరుపుతున్నారని ఆదాయ పన్ను శాఖ సర్వేల్లో తేలడంతో బులియన్ మార్కెట్ మూతపడింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించగా, తర్వాతి రోజు నుంచి బంగారం షాపుల్లో కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దేశంలో కొన్ని చోట్ల 10 గ్రాముల ధర గరిష్ఠంగా 45 వేల రూపాయలకుపైగా పలికిందంటే ఎంత కృత్రిమ డిమాండ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పన్ను ఎగవేతదారులకు, అక్రమ లావాదేవీలకు ఊతమిస్తోందని ఐటి శాఖ సర్వేల్లో తేటతెల్లమైంది. ఒక్కసారిగా డరీబా కలాన్, చాందినీ చౌక్, కరోల్ బాగ్ తదితర ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతాల్లో ఈ నెల 10న పరిశీలనలు జరిపారు. దుకాణాల రికార్డులను తనిఖీలు చేశారు. బంగారం లావాదేవీలకు దేశంలోనే ప్రసిద్ది చెందిన ప్రాంతాలివి. ఈ నేపథ్యంలో 11వ తేదీ నుంచి బులియన్ మార్కెట్ మూతపడగా, మళ్లీ 16 రోజుల తర్వాత సోమవారమే తెరుచుకుంది. అయితే పసిడి, వెండి ధరలు భారీ స్థాయిలో పతనమయ్యాయి. బులియన్ మార్కెట్ చివరిరోజైన నవంబర్ 10న 10 గ్రాముల బంగారం ధర రూ. 31,150 గానూ, కిలో వెండి ధర రూ. 44,700 వద్ద ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు పెరిగాయి. ఔన్సు బంగారం ధర 1,192.80 డాలర్లు, వెండి ధర 16.80 డాలర్లు పలికాయి


Click it and Unblock the Notifications