దేశీయ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 33.83 పాయింట్ల లాభంతో 26350 వద్ద, నిఫ్టీ 12.60 పాయింట్ల లాభంతో 8126.90 వద్ద ముగిశాయి.
దేశీయ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 33.83 పాయింట్ల లాభంతో 26350 వద్ద, నిఫ్టీ 12.60 పాయింట్ల లాభంతో 8126.90 వద్ద ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో స్థిరాస్తి రంగం అత్యధికంగా 1.91% లాభపడగా, విద్యుత్(1.74%), ఎఫ్ఎమ్‌సీజీ(1.23%), చమురు, సహజవాయు(1.06%) దాని తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరో వైపు కన్సూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ 1.2%, బ్యాంకింగ్ 1.16%, ఐటీ రంగం 0.15శాతం నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో భారతి ఎయిర్‌టెల్(5.53%), అదాని పోర్ట్స్(2.6%), ఐటీసీ(2.08%), ఓఎన్‌జీసీ(2.07%), హీరో మోటోకార్ప్(2.05%) ముందు వరుసలో ఉండగా; నష్టపోయిన వాటిలో ఎస్‌బీఐ(2.82%), ఐసీఐసీఐ బ్యాంకు(1.73%), టీసీఎస్(1.02%), ఎల్ అండ్ టీ(0.99%), ఎమ్ అండ్ ఎమ్(0.95%) ఉన్నాయి.
ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయంతో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుందని భావించిన ఆర్బీఐ బ్యాంకులు నిర్వహించాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్ల మేర పెంచడంతో ఈ రోజు బ్యాంకింగ్ రంగ షేర్లపై ఒత్తిడి ఏర్పడింది.


Click it and Unblock the Notifications