నల్ల కుబేరులకు మరో అవకాశం, అయితే ఈసారి 50% పన్ను
నల్లధనం కలిగిన పెద్దోళ్లకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. నిర్దేశిత పరిమాణానికి మించిన రీతిలో ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమయ్యే మొత్తానికి లెక్కలు చూపించలేని పక్షంలో కనీస పక్షంగా 50 శాతం పన్ను చెల్లిస్త
నల్లధనం కలిగిన పెద్దోళ్లకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. నిర్దేశిత పరిమాణానికి మించిన రీతిలో ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమయ్యే మొత్తానికి లెక్కలు చూపించలేని పక్షంలో కనీస పక్షంగా 50 శాతం పన్ను చెల్లిస్తే చాలన్న ప్రకటన చేసింది. అయితే, పన్ను కట్టిన తర్వాత మిగిలిన దానిలో సగం బ్లాక్‌మనీని సంబంధిత ఖాతాదారు వినియోగానికి అందకుండా నాలుగేళ్ల పాటు తమ వద్దే ఉంచేసుకోవాలని సంకల్పించింది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టంలో సవరణలు తీసుకొచ్చి బిల్లును పార్లమెంట్‌లో త్వరలోనే ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నల్లధనం కలిగిన వారి నుంచి ఎంత వీలుంటే అంతగా అక్రమ సొత్తును రాబట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రెండున్నర లక్షల వరకూ ఆదాయం పన్ను ఇబ్బంది లేకుండా డిపాజిట్లు చేసుకోవచ్చునని స్పష్టం చేసిన కేంద్రం.. అందుకు అనుకున్న రీతిలో స్పందన రాకపోవడంతో మరింతగా వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ 30 గడువు ముగిసేలోగా ఇచ్చిన అవకాశాల్ని వినియోగించుకోకుండా నల్లధన వివరాలను వెల్లడించని వారిపై మరింత కఠినంగానే కేంద్రం వ్యవహరించనుంది. దీని అర్థమేమిటంటే ఆదాయం పన్ను శాఖ నేరుగా దాడి చేస్తే తప్ప నల్ల ధన వివరాలు వెల్లడించని వారిపై 90శాతం పన్ను, పెనాల్టీ విధించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

గురువారం రాత్రి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆదాయం పన్ను చట్ట సవరణల ప్రకారం రూ. 2.50 లక్షలకు మించి డిపాజిట్లు జరిగే మొత్తాలపై 50శాతం పన్ను విధిస్తారు. అలాంటి డిపాజిట్లలో సగాన్ని లేదా ఒరిజినల్ డిపాజిట్‌లో 25శాతం మొత్తాన్ని సదరు ఖాతాదారు నాలుగేళ్ల వరకూ వెనక్కి తీసుకునే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. తమంతట తాముగా ఈ మొత్తాన్ని వెల్లడించని వ్యక్తులపై మాత్రం కఠినంగా వ్యవహరించడం తథ్యమని చెబుతున్నారు. 500, 1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం వాటిని కొత్త నోట్లతో మార్చుకునేందుకు 50రోజుల పాటు అవకాశం కల్పించింది. ఈ గడువు డిసెంబర్ 30తో ముగుస్తుందని కేంద్రం ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ మార్పిడి కూడా రద్దు కావడంతో నేరుగానే బ్యాంకుల్లో డిపాజిట్ చేయక తప్పని పరిస్ధితి ఏర్పడింది. ఎంతమంది కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారో చూడాల్సి ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications