ఆదిత్యా బిర్లా ఫైనాన్సియల్ సర్వీసెస్ గ్రూప్ ద్వారా ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు బిర్లా గ్రూప్ ప్రకటించింది. ఇందుకోసం ఆదిత్యా బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్
ఆదిత్యా బిర్లా ఫైనాన్సియల్ సర్వీసెస్ గ్రూప్ ద్వారా ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు బిర్లా గ్రూప్ ప్రకటించింది. ఇందుకోసం ఆదిత్యా బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో ఆదిత్యా బిర్లా గ్రూప్ వాటా 51% ఉండగా, దక్షిణాఫ్రికాకు చెందిన ఆర్థిక సేవల కంపెనీ ఎమ్ఎమ్ఐ హోల్డింగ్స్‌కు మిగిలిన 49% వాటా ఉంటుంది.
ప్రజల్లో అంతగా ఆరోగ్య బీమాపై అవగాహన లేని మార్కెట్లలో భారతదేశం ఒకటి. దాదాపు 3% కంటే తక్కువ మంది సెమీ అర్బన్, గ్రామీణ జనాభాకు ఆరోగ్య బీమా ఉంది. అమెరికాలో 70% మంది ప్రజలు ఆరోగ్య బీమా కలిగి ఉండగా, చైనాలో అది 35-40% మధ్య ఉంది.

మార్చి 2014 నాటికి దేశ జనాభాలో కేవలం 17 శాతం మంది మాత్రమే ఆరోగ్య బీమా కవరేజీ పరిధిలో ఉన్నారు. ఆరోగ్య బీమా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంకెలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ప్రజల జీవన శైలి మారుతున్న కొద్దీ చాలా మందికి ఆరోగ్య బీమా అవసరం ఏర్పడుతోంది. గత రెండు దశాబ్దాల్లో వ్యాధుల ప్రభావం పెరిగింది. ప్రజలు సైతం ముందు జాగ్రత్తగా ఆసుపత్రులకు వెళ్లడం ఎక్కువైంది. "దేశంలో ఆరోగ్య బీమా తగినంతగా చొచ్చుకుపోలేదు. ఇక్కడ అవకాశం ఎక్కువగా ఉంది." అని ఆదిత్యా బిర్లా గ్రూప్(ఫైనాన్సియల్ సర్వీసెస్) సీఈవో అజయ్ శ్రీనివాసన్ వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయి, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, కోల్‌కత, హైదరాబాద్, పుణె నగరాల్లో నూతన సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు గాను రూ. 250 కోట్లను వెచ్చించనున్నట్లు ఆదిత్యా బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ బత్వాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications