దూసుకెళ్లిన మార్కెట్లు: 2% పైకి ఎగసిన సూచీలు
శుక్రవారం ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి.సూచీలు దాదాపుగా 2 శాతానికి పైగా లాభాలను గడించాయి.సాఫ్ట్‌వేర్, లోహ రంగ షేర్లు రాణించడం మదుపర్లకు సంతోషాన్ని తెచ్చిపెట్టింది.బీఎస్ఈసెన్సెక్స్
శుక్రవారం ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సూచీలు దాదాపుగా 2 శాతానికి పైగా లాభాలను గడించాయి. సాఫ్ట్‌వేర్, లోహ రంగ షేర్లు రాణించడం మదుపర్లకు సంతోషాన్ని తెచ్చిపెట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ 456 పాయింట్ల లాభంతో 26316 వద్ద, నిఫ్టీ 149 పాయింట్ల లాభంతో 8114 వద్ద ముగిశాయి.
రూపాయి బలహీనంగా ఉండటంతో సాఫ్ట్‌వేర్ షేర్లు ముఖ్యంగా ఇన్ఫోసిస్ షేర్లను కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపారు. కొన్ని ఉక్కు దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో లోహ రంగ షేర్లు లాభాలను రాబట్టాయి. ఈ రెండు ప్రధాన కారణాలతో మార్కెట్లు బాగా రాణించాయి.

బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(4.69%), టెక్నాలజీ(379%), హెల్త్‌కేర్(2.35%), కన్సూమర్ డ్యూరబుల్స్(1.74%) వినియోగదార్లకు జోష్‌నందించాయి. సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో టీసీఎస్(5.23%), ఇన్ఫోసిస్(4.78%), సన్ ఫార్మా(4.18%), గెయిల్(3.48%), లుపిన్(3.36%) బాగా లాభపడగా; బజాజ్ ఆటో(0.74%), ఎస్‌బీఐ(0.29%), భారతీ ఎయిర్‌టెల్(0.22%) స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి.
మరో వైపు రూపాయి రికార్డు కనిష్ట స్థాయి అయిన 68.8650 నుంచి కోలుకుని 68.46 వద్ద ట్రేడవుతోంది. ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం రూపాయికి లాభించింది. గతవారంలో 2.5% మేర నష్టాలను తెచ్చిపెట్టిన సూచీలు ఈ వారంలో మంచి లాభాలతోనే ముగియడంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications