బ్యాంకు కౌంటర్లలో నగదు మార్పిడిని శుక్రవారం నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. పాత నోట్లు చెల్లుబాటుయ్యేందుకు
బ్యాంకు కౌంటర్లలో నగదు మార్పిడిని శుక్రవారం నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. పాత నోట్లు చెల్లుబాటుయ్యేందుకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వడంతో పాటు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు అనుమతిస్తారు.

నవంబరు 24 నుంచి రూ. 500, రూ. 1000 నోట్లు అర్ధాత్రి నుంచి బ్యాంకుల్లో మార్చుకునేందుకు వీలుండదని గురువారం సాయంత్రం ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రజా వినియోగం ఎక్కువగా ఉండే పెట్రోలు పంపులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర పబ్లిక్ యుటిలిటీ(మున్సిపల్ కార్పొరేషన్లు; కళాశాలల రుసుములు)ల్లో పాత నోట్లను అంగీకరిస్తారు.

డిసెంబరు 15 నుంచి రూ. 500 నోట్లు ఎక్కడెక్కడ చెల్లుతాయి?
* కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, మునిసిపల్, స్థానిక సంస్థల యాజమాన్యాలలో నడుస్తున్న అన్ని పాఠశాలలలో స్కూలు ఫీజులను రూ. 2వేల వరకు రూ. 500 నోట్లతో చెల్లించవచ్చు.
* పెట్రోలు పంపుల్లో రూ. 500 నోట్లను అంగీకరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలలో కూడా ఫీజులు చెల్లించవచ్చు.
* రూ. 500 వరకు ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జికి చెల్లించుకోవచ్చు.
* ఒకసారి రూ. 5వేల విలువైన వస్తువులను వినియోగదారుల సహకార స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.
* మంచినీళ్లు, విద్యుత్ బిల్లుల పాత బకాయిలు, ప్రస్తుత బిల్లులను చెల్లించవచ్చు. ఇది కేవలం వ్యక్తుల గృహాలకు మాత్రమే వర్తిస్తుంది.
* రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ కోరిక మేరకు టోల్ ప్లాజాల వద్ద డిసెంబర్ 2వ తేదీ వరకు టోల్ మినహాయింపు, 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 500 నోట్లతో చెల్లింపునకు ఆమోదం
* విదేశీయులు వారానికి రూ. 5000 వరకు విదేశీ కరెన్సీని మార్చుకునేందుకు అనుమతి. దీనికి సంబంధించిన ఎంట్రీలను వాళ్ల పాస్‌పోర్టులలో నమోదుచేస్తారు.
* ఎల్‌పీజీ సిలిండర్ల కొనుగోలుకు రూ. 500 నోట్లు పాతవి చెల్లుబాటవుతాయి.
* స్మశాన వాటికల్లో పాత నోట్ల చెల్లింపులకు అనుమతిస్తారు.
* డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే చికిత్సలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చెల్లింపులకు రూ. 500 నోట్లు అంగీకరిస్తారు.
* ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే బస్సు, విమాన, రైలు టిక్కెట్లక కౌంటర్లలో చెల్లుబాటవుతాయి.


Click it and Unblock the Notifications