స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నిబంధనల సవరణకు సెబీ బోర్డు ఆమో దం తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం ఏంజెల్ ఇన్వెస్టర్లు ఏదైనా స్టార్
స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నిబంధనల సవరణకు సెబీ బోర్డు ఆమో దం తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం ఏంజెల్ ఇన్వెస్టర్లు ఏదైనా స్టార్టప్ కంపెనీలో పెట్టే కనీస పెట్టుబడి పరిమితిని రూ.50 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించింది. ఈ పెట్టుబడుల లాక్ ఇన్ పీరియడ్ గడువును కూడా మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించింది.

కొత్త నిబంధనలతో ఐదేళ్ల స్టార్టప్ కంపెనీలో కూడా ఏంజెల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకు ముందు ఈ గడువు మూడేళ్లుగా మాత్రమే ఉండేది. ఏదైనా ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకంలో డబ్బు ఇన్వెస్ట్ చేసే ఏంజెల్ ఇన్వెస్టర్ల గరిష్ఠ సంఖ్యను ప్రస్తుతం ఉన్న 49 నుంచి 200కు పెంచారు. ఏంజిల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి నిధుల్లో 25 శాతం వరకు విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు సైతం సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ నారాయణ మూర్తి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సూచనల మేరకు సెబీ(సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజీ బోర్డ్స్ ఆఫ్ ఇండియా) ఈ నిర్ణయాలు తీసుకుంది.
అనధికారిక ఒప్పందాలపై..
లాభాలు పంచుకునేందుకు లిస్టెడ్ కంపెనీల ఉన్నతాధికారులు, ప్రమోటర్లు ప్రైవేట్ ఈక్విటీ (పిఇ) మధ్య కుదిరే అనధికారిక ఒప్పందాలపైనా పెట్టుబడుల నియంత్రణ సంస్థ వేటు వేసింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు, వాటాదారుల సమావేశం ఆమోదం లేకుండా ఇలాంటి ఒప్పందాలు చెల్లవని స్పష్టం చేసింది. మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు సెబీ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు
అన్‌లిస్టెడ్ కంపెనీలు జారీ చేసే రుణ పత్రాలు, చెల్లింపులకు హామీ ఉండే రుణ పత్రాల్లో విదేశీ పోర్టుఫోలియో సంస్థ (ఎఫ్‌పిఐ)లు పెట్టుబడి పెట్టేందుకు కూడా సెబీ ఆమోదం తెలిపింది. అయితే ఈ పెట్టుబడులు రూ.35,000 కోట్లు దాటకూడదని పరిమితి విధించింది. దీనికి తోడు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లలో మాత్రమే పెట్టుబడి పెట్టాలని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications