క్యాష్ లెస్ ఎకానమీకి టెల్కోలు తమ వంతు మద్దతు
పెద్ద నోట్ల రద్దు సమయంలో వినియోగదారుల సౌలభ్యంకోసం అన్ని యూఎస్ఎస్‌డీ ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు చార్జీలను డిసెంబర్ 31 వరకు రద్దు చేసినట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈమేరకు వోడాఫోన్ ఇండ
పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఇప్పటికే మొబైల్ వ్యాలెట్లు తమ వంతు ప్రయత్నాల ద్వారా నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఫీచర్ ఫోన్లలో ఉండే కొన్ని సదుపాయాలకు ఇదివరకూ టెల్కోలు విధించే చార్జీల వల్ల దాన్ని ఉపయోగించుకునేందుకు ప్రజలు మొగ్గుచూపలేదు. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థలు వినియోగదారులకు స్వల్ప వెసులుబాటును కల్పించాయి. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో డిసెంబర్ 31 దాకా మొబైల్ బ్యాంకింగ్ పై వసూలు చేసే చార్జీలను రద్దు చేసింది. ఫీచర్ ఫోన్ల లో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సౌకర్యాలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు మూడు ప్రధాన టెలికాం కంపెనీలు అంగీకారం తెలిపినట్లు వరుస ట్వీట్లలో రాసుకొచ్చారు.

ముఖ్యంగా యూఎస్ఎస్‌డీ పిలువబడే మొబైల్ బ్యాంకింగ్ సేవలను టెలికాం ఆపరేటర్లు ఉచితంగా అందించనున్నట్టు తెలిపారు. సామాన్యులకు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సౌకర్యం, కరెన్సీ కష్టాలను తగ్గించడంకోసం డిసెంబర్ 31, 2016 వరకు ఈ చార్జీలను రద్దుచేయడానికి నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు.

పెద్ద నోట్ల రద్దు సమయంలో వినియోగదారుల సౌలభ్యంకోసం అన్ని యూఎస్ఎస్‌డీ ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు చార్జీలను డిసెంబర్ 31 వరకు రద్దు చేసినట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈమేరకు వోడాఫోన్ ఇండియా ఎండీ, సీఈవో సునీల్ సూద్ కూడా ఒక ప్రకటన చేశారు. మరోవైపు ట్రాయ్ కూడా షార్ట్ కోడ్ మెసేజ్ చార్జీలను కూడా భారీగా కోత పెట్టనుంది. ఇప్పటివరకూ వసూలు చేస్తున్న రూ.1.50 నుంచి 50 పైసలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 31 తరువాత ఈ చార్జీలను గరిష్టంగా 50పైసలు వసూలు చేయనున్నట్టు ప్రత్యేక ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications