ఒక్క శ్రీకాకుళంలోనే 5 వేల స్వైపింగ్ మెషీన్లకు ఆర్డర్లు
పెద్ద నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలో నగదు ప్రవాహం తగ్గింది. దీంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నగదు కొరత నుంచి ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. దాదాపు అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్స్) మెషీన్ల కోసం అభ్యర్థిస్తున్నాయి.
ఆ జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు చెపుతున్న దాని ప్రకారం ఇప్పటి వరకూ దాదాపు 5 వేల స్వైపింగ్ మెషీన్ల కోసం ఇండెంట్ల దాఖలు పూర్తయింది.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 5 వేల స్వైపింగ్ మెషీన్ల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు లీడ్ బ్యాంక్ మనేజర్ వెంకటేశ్వరరావు చెప్పారు. నగదు ఇబ్బందుల నేపథ్యంలో చాలా వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు స్వైపింగ్ మెషీన్ల కోసం క్యూ కడుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ఎక్కువ ఆసక్తిని చూపుతున్నాయని వెల్లడించారు. "చెన్నై నుంచి రోజుకు 100 మెషీన్ల వరకూ వస్తున్నాయి. అయితే అవి వచ్చిన తర్వాత సాంకేతిక తనిఖీలు పూర్తయి, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ జరగాలి. ఆ తదనంతరమే వాటిని వినియోగదార్లకు అందజేస్తాం" అని చెప్పుకొచ్చారు. వచ్చే పదిరోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైనన్ని స్వైపింగ్ మెషీన్లను వ్యాపార వర్గాలకు అందజేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications