దేశాధినేతల వేతనాలెంతో తెలుసా?
త్యధిక జీతాలు తీసుకునే విషయంలో సింగపూర్ ప‌్రధాని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా, భారత ప్రధానమంత్రి, చైనా అధ్యక్షులు మొదటి పది స్థానాల్లో లేరు. చైనా అధ్యక్షుడు మోడీ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ న
దేశాన్ని అభివృద్ది పథంలోకి నడిపించేది దేశ ప్రధానమంత్రులు, దేశాధ్యక్షులు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల అమెరికా ఎన్నికలను ప్రపంచమంతా ఎంత ఆసక్తిగా చూశారో ఆ స్థాయిలో ఏ ఇతర ఎన్నికలను చూడలేదంటే అతిశయోక్తి కాదు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత కేవలం ఒక డాలరునే వేతన రూపంలో తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. దీంతో ఎవరెవరు ఎంత జీతాలు తీసుకుంటారనేది ఒక విధంగా ఆసక్తి కరమైన విషయమే. అత్యధిక జీతాలు తీసుకునే విషయంలో సింగపూర్ ప‌్రధాని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా, భారత ప్రధానమంత్రి, చైనా అధ్యక్షులు మొదటి పది స్థానాల్లో లేరు. చైనా అధ్యక్షుడు మోడీ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుల, ప్రధానుల జీతభత్యాల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. (ఈ సమాచారం ఎక్కువగా 2015 సంవత్సరానికి సంబంధించింది.)

1. సింగపూర్ ప్రధానమంత్రి
సింగపూర్ ప్రధాని లీ హెచ్ సిన్ లూంగ్ వేతనం 17 లక్షల డాలర్లు. సగటు సింగపూర్ పౌరుడి వేతనం కంటే ఇది 30 రెట్లు ఎక్కువ. 2008 నుంచి 2012 మధ్య ఏడాదికి రూ. 28,56,930 డాలర్లు జీతం రూపంలో ఆయన అందుకున్నారు. ప్రజలంతా అసంతృప్తిని వెలిబుచ్చడంతో తర్వాత వేతనాన్ని 28% మేర తగ్గించుకున్నారు. ప్రస్తుతం ఏడాదికి రూ. 2.2 మిలియన్ సింగపూర్ డాలర్ల(17 లక్షల అమెరికన్ డాలర్ల) వేతనం ఉంది.

2. హాంగ్ కాంగ్ సీఈవో
హాంగ్‌కాంగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈవో) వేతనం 5,30,000 లక్షల డాలర్లుగా ఉంది. ఆ దేశ సగటు పౌరుడి వేతనం కంటే ఇది 12 రెట్లు ఎక్కువ. అంతేకాకుండా పొరుగు దేశం చైనా అధ్యక్షుడి వేతనం కంటే 27 రెట్ల వేతనాన్ని హాంగ్‌కాంగ్ సీఈవో తీసుకుంటుండం విశేషం.

3. అమెరికా అధ్యక్షుడు ఒబామా వేతనం: రూ. 2 కోట్ల72 లక్షలు
అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం 4,00,000 డాలర్లు. మన దేశ కరెన్సీలో రూ.2.72 కోట్లు. అమెరికా దేశ సగటు పౌరుడి వేతనం కంటే ఆ దేశ అధ్యక్షుడి జీతం 8 రెట్లు ఎక్కువ. జార్జ్ బుష్(జూనియర్) అధ్యక్షుడుగా ఉన్న సమయంలో అమెరికా అధ్యక్షుడి వేతనాన్ని రెండింతలు చేశారు.
రోజువారీ అలవెన్సు రూపంలో రూ. 31 లక్షలు
ప్రయాణ భత్యం రూపంలో రూ. 66 లక్షలు
వినోదం, ఇతర వ్యాపకాలకు రూ. 11 లక్షలు

4. ఆస్ట్రేలియా అధ్యక్షుడి వేతనం
ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వేతనం ఏడాదికి 3,45,000 లక్షల డాలర్లు.

5. ఐర్లాండ్ అధ్యక్షుల వేతనం
ఐర్లాండ్ అధ్యక్షుల వార్షిక వేతనం 3,40,000 డాలర్లు. మైకెల్ డి. హెగ్గిన్స్ ప్రధాని కాక ముందు ఆ దేశాధ్యక్షుల జీతం 340000 డాలర్ల కంటే ఎక్కువ ఉండేది. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత వేతనాన్ని 23.5% తగ్గించుకున్నారు.

6. లక్సంబర్గ్ ప్రధాని వేతనం
లక్సంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెట్టెల్ వేతనం ఏడాదికి 3,40,000 డాలర్లు. అంతకుముందు ఆయన లక్సంబర్గ్ నగర మేయర్‌గా పనిచేశారు. ఆ దేశంలోని లక్సంబర్గ్ డెమక్రటిక్ పార్టీలో సభ్యుడాయన.

7. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయు
కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయు వేతనం 2,96,400 డాలర్లు ఇదే భారత కరెన్సీ రూపంలో దాదాపు రూ. 2 కోట్లుగా ఉంది. దీనికే ఆ దేశంలో ప్రధాని వేతనం ఎక్కువగా ఉన్నట్లు ప్రజలు అభ్యంతరపెడుతున్నారు.

8. న్యూజిలాండ్ ప్రధాని వేతనం
న్యూజిలాండ్ ప్రధానమంత్రి వార్షిక వేతనం 2,90,000 అమెరికన్ డాలర్లు. సగటు న్యూజిలాండ్ పౌరుడి వేతనం కంటే ఇది 10 రెట్లు ఎక్కువ.

9. జర్మనీ చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ వేతనం
జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ వేతనం ఏడాదికి 2,83,000 డాలర్లు. దేశీయ కరెన్సీ రూపంలో అది రూ. 1.93 కోట్లతో సమానం. యూరోపియన్ యూనియన్ రూపకల్పనకు ఆమే కారణం కావడం వల్ల ఆమె ఈ స్థాయి వేతనం అందుకోవడం సబబేనని చాలా మంది అబిప్రాయం.

10. దక్షిణాఫిక్రా అధ్యక్షుడి వేతనం
దక్షిణాఫిక్రా అధ్యక్షుడు జాకబ్ జుమా వేతనం 2,72,000 డాలర్లు. ఆ దేశ సగటు పౌరుడి వేతనం కంటే అధ్యక్షుడి వేతనం 26 రెట్లు ఎక్కువ. జాకబ్ జుమా ఆఫ్రికాలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న దేశాధినేతగా ఉన్నారు.

11. ఇటలీ ప్రధాని
ఇటలీ ప్రధాని మొటయో రేంజి వేతనం ఏడాదికి 124000 డాలర్లు.
భారత కరెన్సీలో దాని విలువ రూ. 84 లక్షలు

12. భారత ప్రధాని
భారత ప్రధానమంత్రి వార్షిక వేతనం 30,300 డాలర్లు. మన దేశంలో జీతం కంటే ఎక్కువగా అలవెన్సుల రూపంలో ప్రయోజనాలు ఉంటాయి. దేశీయ కరెన్సీలో ప్రధాని వేతన విలువ ఈ ఏడాది రూ. 20.63 లక్షలుగా ఉంది.

13. చైనా అధ్యక్షుడు
చైనా అధ్యక్షుడి వార్షిక వేతనం 22,000 డాలర్లు. భారత దేశ కరెన్సీలో
దాని విలువ రూ. 14 లక్షలు


Click it and Unblock the Notifications