కోలుకున్న మార్కెట్లు:6 నెలల కనిష్టాల నుంచి పైకి
వరుస నష్టాల నుంచి మంగళవారం స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. దాదాపు ఆరు నెలల కనిష్టం నుంచి లాభాల్లోకి వచ్చాయి. ముడి చమురు ధరలు పెరగడం, సానుకూల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్
వరుస నష్టాల నుంచి మంగళవారం స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. దాదాపు ఆరు నెలల కనిష్టం నుంచి లాభాల్లోకి వచ్చాయి. ముడి చమురు ధరలు పెరగడం, సానుకూల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు సానుకూలంగా కొనసాగాయి
బీఎస్ఈ సెన్సెక్స్ 195.64(0.76%) లాభపడి 25,960.78 వద్ద ముగియగా; జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ నిఫ్టీ 73 పాయింట్లు బలపడి 8002 వద్ద స్థిరపడింది.

ఈ రోజు వార్తల్లో నిలిచిన కొన్ని షేర్లు
సువెన్ లైఫ్ సైన్సెస్
సువెన్ లైఫ్ సైన్సెస్ షేర్లు బాగా లాభపడ్డాయి. చైనా, మెక్సికో దేశాల నుంచి రెండు ఉత్పత్తులకు అనుమతులు రావడమే ఇందుకు కారణం. ఒక దశలో 171.45 స్థాయికి ఎగబాకిన ఈ సంస్థ షేర్ బీఎస్ఈలో ఈ రోజు మొత్తం 2.79% లాభపడి రూ. 171 వద్ద ముగిసింది.
ఫైనాన్సియల్ టెక్నాలజీస్
రెండో త్రైమాసికంలో మంచి ఫలితాలను రాబట్టడంతో ఫైనాన్సియల్ టెక్నాలజీస్ షేర్లు బీఎస్ఈలో 0.69 శాతం లాభపడి రూ. 531 వద్ద స్థిరపడింది. ఒక దశలో రూ. 560 గరిష్ట స్థాయిని తాకింది.
పీఎన్‌బీ గిల్ట్స్
2017 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మూడింతల లాభాలను నమోదు చేయడంతో పీఎన్‌బీ గిల్ట్స్ షేర్లు 10శాతం లాభాలను గడించాయి. బీఎస్ఈలో ఈ సంస్థ షేరు 9.97% పైకి ఎగిసి రూ. 51.30 వద్ద స్థిరపడింది.
యునిటెక్
యునిటెక్ షేర్లన్నీ 1.87% నష్టపోయి రూ. 4.90 వద్ద ముగిశాయి. రూ. 4.10 ఇంట్రాడే కనిస్ట స్థాయిని తాకాయి.
శ్రీ సిమెంట్
శ్రీ సిమెంట్ షేర్లు బీఎస్ఈలో 3.80 శాతం లాభపడి రూ. 14898 వద్ద ముగిసింది.
రూ. 15052 వద్ద ఈ సంస్థ షేరు ఇంట్రా డే గరిష్ట స్థాయిని తాకింది.
Read in English: Stocks That Were In News On November 22, 2016


Click it and Unblock the Notifications