నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు సంక్షోభం నేపథ్యంలో.. వాహన, ఇంటి రుణాలు, పంట రుణాలు తీసుకున్నవారికి ఉపశమనం కలిగించేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రుణాల చెల్లింపునకు 60 రోజుల అదనపు గడువునిస్
నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు సంక్షోభం నేపథ్యంలో.. వాహన, ఇంటి రుణాలు, పంట రుణాలు తీసుకున్నవారికి ఉపశమనం కలిగించేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రుణాల చెల్లింపునకు 60 రోజుల అదనపు గడువునిస్తున్నట్లు పేర్కొంది. అయితే, రూ.కోటి లోపు రుణాలు తీసుకున్నవారికి మాత్రమే ఈ వెసులుబాటు. అది కూడా నవంబరు 1 నుంచి డిసెంబరు 31 దాకా చెల్లించాల్సిన వాటికి వర్తిస్తుందని ఆర్బీఐ పేర్కొంది.

వ్యాపారం కోసం లేదా వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్న కాలపరిమితి రుణాలు, తాకట్టు రుణాలు ఇతరత్రా.. రూ.కోటి అంతకన్నా తక్కువ లోన్లు.. బ్యాంకుల నుంచి తీసుకున్నవి, బ్యాంకేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) నుంచి, సూక్ష్మరుణ సంస్థల నుంచి తీసుకున్న వాటన్నింటికీ ఈ వెసులుబాటు లభిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని పలు బ్యాంకింగ్ వర్గాలు స్వాగతించాయి. ''నోట్ల రద్దు నిర్ణయం వల్ల చాలా మంది ఖాతాదారులు సమయానికి చెల్లింపులు జరపలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతించదగింది'' అని డీహెచ్ఎఫ్‌ఎల్ సీఈవో హర్షిల్ మెహతా అన్నారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 31లోపు ఈఎంఐలు కట్టాల్సినవారు నగదు సంక్షోభం కారణంగా ఆ సొమ్మును చెల్లించలేకపోయినప్పటికీ.. వారి క్రెడిట్ స్కోరు దెబ్బతినదని వివరించారు. కాగా.. ఓవర్‌డ్రాఫ్ట్/క్యాష్ క్రెడిట్ ఖాతాలు కలిగినవారికి నగదు ఉపసంహరణ పరిమితిని వారానికి రూ.50 వేలకు పెంచుతూ మరో నిర్ణయాన్ని కూడా ఆర్బీఐ తీసుకుంది. ఇంతకుముందు ఈ అవకాశాన్ని కరెంటు ఖతాలున్నవారికి మాత్రమే వర్తింపజేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజా వెసులుబాటు వ్యక్తిగత ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలున్నవారికి వర్తించదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications