8000కు దిగువన నిప్టీ
ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకంపనలతో పాటు, విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను కొనసాగిస్తుండటంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకంపనలతో పాటు, విదేశీ పెట్టుబడిదారులు దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను కొనసాగిస్తుండటంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 385.10 పాయింట్లు నష్టపోయి. 25,765.14 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 145 పాయింట్ల నష్టంతో కీలకమైన 8,000 స్థాయిని కోల్పోయి 7,929.10 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో అన్ని రంగాలు ఎరుపెక్కాయి. స్థిరాస్తి రంగం(4.71%), లోహ రంగం(3.34%), పీఎస్‌యూ(3.25%), వాహన(ఆటో) రంగం (3.25%) నష్టపోయాయి.అన్ని రంగాలు నష్టాల్లో కొనసాగుతున్నా ఐటీ రంగం మాత్రం నిలదొక్కుకుంది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన వాటిలో ఎస్‌బీఐ(6.51%), టాటా స్టీల్(3.52%), పవర్ గ్రిడ్(3.23%), ఎమ్ అండ్ ఎమ్(3.16%) ఉండగా; విప్రో (1.12%), టీసీఎస్(0.44%), సన్‌ఫార్మా(.36%), రిలయన్స్(0.34%), ఓఎన్‌జీసీ(0.15%) లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications