నోట్ల కష్టాలు తొలగించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మరిన్ని ఉపశమన చర్యలు ప్రకటించింది. కరెంట్, ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాలు కలిగిన వారికి నగదు విత్ డ్రా పరిమితిని వారంలో 50,000
నోట్ల కష్టాలు తొలగించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మరిన్ని ఉపశమన చర్యలు ప్రకటించింది. కరెంట్, ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ ఖాతాలు కలిగిన వారికి నగదు విత్ డ్రా పరిమితిని వారంలో రూ. 50 వేలకు పెంచింది. వీరికి రూ. 2 వేల నోట్లు ఇస్తారు. కనీసం మూడు నెలల నుంచి ఈ ఖాతాలు నిర్వహిస్తున్న వారికే వారంలో రూ. 50 వేలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. వ్యక్తిగత ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలు కలిగిన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది.

రైతులకు సైతం మరింత ఊరట కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దుకాణాల్లో రద్దు చేసిన పాత 500 నోట్లతో విత్తనాలు కొనుగోలు చేసేందుకు వారికి అనుమతి ఇచ్చింది. ధ్రువీకృత గుర్తింపు కార్డు చూపించి అన్నదాతలు విత్తనాలు కొనుగోలు చేయొచ్చు. కేంద్ర, రాష్ట్ర విత్తన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐసీఏఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చీ) సంస్థల నుంచి విత్తనాలు కొనుక్కోవచ్చు. వివాహాలకు రేపటి నుంచి రూ. 2.5 లక్షల విత్ డ్రా సదుపాయం కల్పించనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఇంతకుముందే ఈ ప్రకటన చేసినప్పటికీ మార్గదర్శకాలు లేకపోవడంతో ఇప్పటివరకూ ఇది అమలు కాలేదు. కాగా, నవంబర్ 10 నుంచి 18 వరకు బ్యాంకు ఖాతాల నుంచి ప్రజలు రూ. 1.03 లక్షల కోట్లు విత్ డ్రా చేశారని ఆర్బీఐ వెల్లడించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications