ఇతరుల ఖాతాల్లో బ్లాక్ మనీ డిపాజిట్ చేస్తే ఏడేళ్ల జైలు.. జరిమానా
తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఇతరుల ఖాతాల్లో డిపాజిట్ నల్ల బాబుల కు గరిష్ఠంగా ఏడేళ్ల దాకా జైలు శిక్ష తప్పదని ఆదాయపన్ను శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అలాంటివారిపై నూతన బినామీ లావాదేవీల చట్టం ప్రకారం చ
తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఇతరుల ఖాతాల్లో డిపాజిట్ నల్ల బాబుల కు గరిష్ఠంగా ఏడేళ్ల దాకా జైలు శిక్ష తప్పదని ఆదాయపన్ను శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అలాంటివారిపై నూతన బినామీ లావాదేవీల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అలాంటి నల్ల డబ్బు(నగదు) జమ అయిన ఖాతాలను గుర్తించేందుకు ఆ శాఖ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇలా ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఆ శాఖ నిర్వహించిన 80 సర్వేలు, 30 సోదా ల్లో 200 కోట్ల దాకా లెక్కల్లో లేని సొమ్మును గుర్తించినట్టు.. రూ.50 కోట్లకు పైగా సీజ్ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఆయా ఖాతాల్లో జమ అయిన సొమ్ము నిజంగానే లెక్కల్లో లేని నల్లధనంగా రుజువైతే.. ఖాతా కలిగిఉన్న వ్యక్తిని, అందులో నల్ల డబ్బు వేసినవారిని 'బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్, 1988' కింద విచారిస్తారు. కొత్త చట్టం ఈ ఏడాది నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. నవంబరు 8 తర్వాత ఇలాంటి లావాదేవీల ను గుర్తించి కొందరు వ్యక్తులకు ఈ చట్టం ప్రకా రం ఇప్పటికే నోటీసులు పంపించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. తొలిదశలో రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ జమ అయిన ఖాతాలకే నోటీసులు జారీ చేస్తారు.
ఆధారాలు చూపలేని వారికి కష్టాలు తప్పవు
ఎవరైనా వ్యక్తి ఖాతాలో వేరొకరి రూ. 500, రూ. 1000 నోట్లు డిపాజిట్ చేసి, తర్వాత కొత్త నోట్ల రూపంలో వెనక్కి తీసుకోవడం బినామీ లావాదేవీ అవుతుంది. భారీ మొ త్తాలను తమ ఖా తాలో జమ చేసి రాబడికి తగిన ఆధారాలు చూపించలేకపోతే వారి పై బినామీ లావా దేవీ చట్టం కింద చర్యలు తీసుకు నే అవకాశముంది. ఖాతాలో జమచేసిన సొమ్ము తమదేనని, నిరూపించే ఆధారాలను సమర్పించగలిగితే ఖాతాదారులకు ఇబ్బందులు ఉండవు! సాధారణ ప్రజలకు ఈ చట్టం వల్ల ఇబ్బందులు ఉండకపోవచ్చు.


Click it and Unblock the Notifications