దేశీయ మార్కెట్లు వరుసగా అయిదో రోజూ నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 77.38 పాయింట్లు నష్టపోయి 26,150.24 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 5.85 పాయింట్ల నష్టంతో 8,074.10 వద్ద ట్రేడిం
దేశీయ మార్కెట్లు వరుసగా అయిదో రోజూ నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 77.38 పాయింట్లు నష్టపోయి 26,150.24 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 5.85 పాయింట్ల నష్టంతో 8,074.10 వద్ద ట్రేడింగ్‌ను ముగిసింది. అమెరికా ఫెడ్ ఛైర్‌పర్సన్ జానెట్ యలెన్ ప్రసంగం నేపథ్యంలో డిసెంబర్‌లో వడ్డీరేట్లు పెరుగుతాయని సంకేతాలు అందాయి. దీంతో ఫారిన్ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదార్లు తమ పెట్టుబడులను వెనక్కి మళ్లిస్తున్నారు. ఇది మార్కెట్లలో నష్టాలకు కారణమైంది. సెన్సెక్స్ 0.30శాతం నష్టపోయింది.

సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో ఎన్‌టీపీసీ(4.58%), సన్‌ఫార్మా(2.62%), భారతి ఎయిర్‌టెల్(2.33%), హీరో మాటోకార్ప్(2.15%) ఉండగా బాగా నష్టపోయిన వాటిలో టాటా స్టీల్(2.00%), ఐటీసీ(1.92%), గెయిల్(1.76%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(1.47%), అదానీ పోర్ట్స్(1.25%) ఉన్నాయి.
ఆసియా మార్కెట్లను చూస్తే షాంఘై కాంపోజిట్ సూచీ 0.16% పడగా, జపాన్ నిక్కీ 0.84% పైకి ఎగసింది. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 0.20% లాభపడగా, అమెరికా డోజోన్స్ గురువారం ట్రేడింగ్‌లో 0.19% బలపడింది.
మరో వైపు డాలరుతో రూపాయి 37 పైసలు నష్టపోయి 68.19 వద్ద ట్రేడవుతోంది. బలహీనంగా ఉన్న దేశీయ మార్కెట్లతో పాటు, అమెరికా కరెన్సీని కొనేందుకు దిగుమతిదార్లు మొగ్గుచూపడంతో రూపాయి బాగా నష్టపోయింది. అంతే కాకుండా విదేశీ పెట్టుబడి నిధులు తరలిపోవడం కూడా కారణమైంది. ఉదయమ ప్రారంభ ట్రేడింగ్‌లోనే రూపాయి 23 పైసలు నష్టపోయి 68.05కు చేరింది.


Click it and Unblock the Notifications