పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకు పెద్ద ఎత్తున డబ్బు వచ్చి చేరుతోంది. నగదు నిల్వలు పెరుగుతుండటంతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. కొన్ని రిటైల్, బల్క్ డిపాజిట్లపై చెల్లి
పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకు పెద్ద ఎత్తున డబ్బు వచ్చి చేరుతోంది. నగదు నిల్వలు పెరుగుతుండటంతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. కొన్ని రిటైల్, బల్క్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లను ఎస్బీఐ 15 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా వేటు రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు అదే బాట పట్టాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.25శాతం వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా త్వరలో రుణాలపై వడ్డీరేట్లు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.

390 రోజుల నుంచి రెండేళ్ల వ్యవధి ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.15శాతం తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు తన వెబ్సైట్లో పేర్కొంది. దీంతో ప్రస్తుతం 7.25శాతం ఉన్న వడ్డీరేటు 7.10శాతానికి తగ్గనుంది.
ఇక హెచ్డీసీఎఫ్సీ బ్యాంకు కూడా బల్క్ డిపాజిట్లపై 0.25శాతం తగ్గినట్లు తన వెబ్సైట్లో ఉంచింది. తాజా వడ్డీరేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. దీంతో 7శాతం నుంచి 6.25శాతానికి వడ్డీరేట్లు తగ్గాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications