పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో వివిధ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా కొన్ని వదంతులపై తన ఖండనలను వ
పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో వివిధ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా కొన్ని వదంతులపై తన ఖండనలను విడుదల చేసింది. అవేంటో తెలుసుకుందాం.

1. మిగిలిన నోట్ల రద్దు లేదు
ప్రధానమంత్రి రూ. 100, 50 నోట్ల రద్దు గురించి సైతం జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు.
నిజం: ప‌్రస్తుతం రద్దు చేసిన రెండు పెద్ద నోట్లు కాకుండా మిగిలిన ఏ నోట్లను రద్ద చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు.

2. సమాచారం ఎవరికి లీక్ అవ్వలేదు
నోట్ల రద్దు గురించి సమాచారం కొన్ని కార్పొరేట్ సంస్థలకు, కొంత మంది పార్టీ సభ్యులకు ముందే లీకైంది.
నిజం: పూర్తి సీక్రెట్‌గా ఈ నిర్ణయం తీసుకోబడింది. ఎవరికీ ప్రత్యేకంగా లీక్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు.

3. పెద్దనోట్ల రద్దు తర్వాత నిర్వహణకు ఖర్చు ఎక్కువ అవ్వదు
నోట్ల రద్దు తర్వాత కలిగే ప్రయోజనాల కంటే ప్రభుత్వానికి ఖర్చే ఎక్కువ అవుతుంది.
నిజం: సమాంతర ఆర్థిక వ్యవస్థ మూలంగా దేశ అభివృద్ది దెబ్బతింటోంది.
ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికరంగా పరిణమించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

4. బ్లాక్ మనీ(నల్ల ధనం) కట్టడికై
ఇది కేవలం ప్రభుత్వం మెప్పు కోసం చేసిన పని. నల్ల ధనాన్ని పొదుపు చేసుకోవడానికి ప్రజలు ఇతర మార్గాలను అన్వేషిస్తారు. ఇప్పటికే పరిశ్రమలు, కొంత మంది పెద్దవాళ్లు అందుకోసం ప్రయత్నాలను మొదలుపెట్టారు.
నిజం: అన్ని నియంత్రణ సంస్థలు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నాయి. బినామీ లావాదేవీల చట్టానికి సైతం సవరణలు జరిగాయి. నల్లధనం కట్టడికై వివిధ సంస్థలు తమ సమాచారాన్ని విదేశాలతో సైతం పంచుకుంటున్నాయి.

5. చిప్ లేదు
నల్ల ధనాన్ని పోగుచేసే వారిని గుర్తించేందుకు కొత్త నోట్లలో చిప్‌ను పెడుతున్నారు.
నిజం: ఇది ఒక ఊహ మాత్రమే. కొత్త నోట్లలో ఎటువంటి చిప్ పెట్టలేదు.

6. కలర్ పోతుంది
చాలా తక్కువ నాణ్యతతో రూ. 2 వేల నోటు తయారుచేశారు. కలర్ పోతుంది.
నిజం: ఈ కరెన్సీ నోట్ల తయారీకి ఇంటాగ్లియో ప్రింటింగ్ అనే భద్రతా ప్రమాణం ఉంటుంది. నోటును చెక్ చేసుకునేందుకు ఒక వస్త్రంతో రుద్దవచ్చు. అప్పుడు ఒక రకమైన టర్బో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ వస్త్రానికి రంగు అంటుకుంటుంది. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం రంగు మంచి నాణ్యతతో ఉన్నది. చెక్ చేయాల్సిన అవసరమేమీ లేదు.

7. తదుపరి చర్యల్లో లాకర్లు సీల్ చేస్తారు, బంగారాన్ని ఫ్రీజ్ చేస్తారు
ఇక తదుపరి చర్యల్లో బ్యాంకు లాకర్ల సీల్, ఆభరణాల ఫ్రీజింగ్ ఉంటుంది.
నిజం: ఇది నిరాధారమైనది. బ్యాంకు లాకర్లను సీల్ చేయడం కానీ, బంగారం, వజ్రాలు, ఆభరణాలను ఫ్రీజ్ చేసే ప్రతిపాదన ఏదీ లేదు.


Click it and Unblock the Notifications