సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు, రైతులకు కేంద్ర నిర్ణయం ఊరటనిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ గురువారం ఉదయం ఆర్థిక శాఖ తీసుకున్న చర్యలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ సంద
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రజలకు మరిన్నిఉపశమన చర్యల్ని ప్రకటించింది. ముఖ్యంగా వివాహాల సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు, రైతులకు కేంద్ర నిర్ణయం ఊరటనిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ గురువారం ఉదయం ఆర్థిక శాఖ తీసుకున్న చర్యలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్బంగా కొన్ని వెసులు బాట్లను, మరిన్ని మార్పులను వెల్లడించారు. అయితే రద్దు చేసిన రూ. 500, రూ.1000 నోట్లను మార్చుకునే పరిమితిని రూ.4,500 నుంచి రూ.2,000కు తగ్గిస్తున్నట్టు వెల్లడించారు.
ఆర్థిక శాఖ కార్యదర్శి వెల్లడించిన పలు విషయాలు
* పంట రుణాలు తీసుకున్న రైతులు వారానికి రూ. 25 వేల వరకూ విత్‌డ్రా చేయొచ్చు.
* మార్కెట్ యార్డ్‌లు, మండీలు చేసిన చెల్లింపులకు సంబంధించి రైతులు వారి ఖాతాల నుంచి వారానికి రూ.25 వేల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు.
* ఏపీఎమ్‌సీ మార్కెట్లలో నమోదైన ట్రేడర్లు(వ్యాపారులు) వారి అకౌంట్ల నుంచి వారానికి రూ. 50 వేల వరకూ తీసుకోవచ్చు.
* క్రాప్ ఇన్సూరెన్స్(పంట బీమా) కోసం ప్రీమియంను చెల్లించే గడువును మరో 15 రోజులు పెంచారు.
* కొడుకు లేదా కూతురు వివాహం ఉన్న తల్లిదండ్రులు వారి స్వయం ధ్రువీకరణ ద్వారా వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ. 2,50,000 వరకూ విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతిస్తారు.
* కౌంటర్ల వద్ద నోట్లు మార్చుకునే పరిమితిని రూ. 4500 నుంచి రూ. 2 వేలకు తగ్గించారు. ఈ మార్పు 18 నవంబరు నుంచి అమల్లోకి వస్తుంది.



Click it and Unblock the Notifications