వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య ట్రేడయ్యాయి. రోజుమొత్తం పలుమార్లు హెచ్చుతగ్గులను చవిచూశాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 71 పాయింట్లు కోల్పోయి
వరుసగా రెండో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య ట్రేడయ్యాయి. రోజుమొత్తం పలుమార్లు హెచ్చుతగ్గులను చవిచూశాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 71 పాయింట్లు కోల్పోయి 26,228 వద్ద నిలవగా, ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 8,080 వద్ద స్థిరపడింది. తద్వారా నిఫ్టీ కీలక స్థాయి 8,100 పాయింట్ల దిగువన నిలిచింది. జూన్ 27 తరువాత నిఫ్టీకిదే కనిష్టంకాగా, సెన్సెక్స్ 26450-26155 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఇక నిఫ్టీ కూడా 8151-8060 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు మరింత బలపడి 14 నెలల గరిష్టం 100.57ను తాకగా, దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలు అమ్మకాలు కొనసాగించారు. గత రెండు రోజుల్లోనే నగదు విభాగంలో దాదాపు రూ. 4,200 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

టెక్, టెలికామ్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్ఈ వివిధ రంగాల సూచీల్లో ఇంధన(Power) రంగ షేర్లు లాభపడ్డాయి. బీహెచ్ఈఎల్ 1.4% లాభపడగా హెచ్ఎస్‌బీసీ గ్లోబల్ రీసెచర్చ్ దాని స్టాక్ రేటింగ్‌ను తగ్గించుకోవడం నుంచి కొనేందుకు సూచించే విధంగా పెంచింది. నష్టపోయిన వాటిలో ఆటో, ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు ఉన్నాయి. దీంతో హీరో మోటోకార్ప్ 1.25% తగ్గింది.
నిఫ్టీ గెయినర్లలో టాటా మోటార్స్, హిందాల్కో,పవర్ గ్రిడ్, గెయిల్ ఉండగా; నష్టపోయిన వాటిలో అంబుజా సిమెంట్స్, భారతి ఎయిర్‌టెల్, జీ ఎంటర్‌ప్రైజెస్, టీసీఎస్, ఏసీసీ ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications