తెలుగు గుడ్‌రిటర్న్స్ తమ పాఠకుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. తెలుగులో బిజినెస్ వార్తలు సంక్షిప్తంగా, వేగంగా తక్కువ సమయంలో ఎక్కువ వార్తలను చదివేలా ఒకే కథనంలో అన్ని వార్తలను సంక్షి
తెలుగు గుడ్‌రిటర్న్స్ తమ పాఠకుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. తెలుగులో బిజినెస్ వార్తలు సంక్షిప్తంగా, వేగంగా తక్కువ సమయంలో ఎక్కువ వార్తలను చదివేలా ఒకే కథనంలో అన్ని వార్తలను సంక్షిప్తీకరిస్తోంది. ఉద్యోగ జీవితాలతో అందరూ బిజీగా ఉంటున్న సమయం ఇది. అలాంటి వారి కోసమే ముందు రోజు వార్తలు సంక్షిప్తంగా, వేగంగా చదివేందుకు. దీని ద్వారా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్; బంగారం ధరలను ఒకేచోట తెలుసుకోండి.

50 వేల పైన డిపాజిట్లకు పాన్ తప్పనిసరి
రూ. 50 వేలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేసేవారు తమ పాన్ కార్డు నకళ్లను బ్యాంకులకు అందజేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్యాంకు ఖాతాతో ఇదివరకే పాన్‌కార్డు అనుసంధానం చేసిన వారికి ఇది అవసరం లేదు. అనుసంధానం చేయనివారి ఖాతాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని రిజర్వ్‌బ్యాంక్ వివరించింది.

ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు గడువు పెంపు
జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) తన పాలసీదారులకు వెసులుబాటు కల్పించింది. నవంబర్ 9 నుంచి 30 మధ్య కాలంలో ప్రీమియం చెల్లించాల్సిన తుది గడువు (గ్రేస్ పిరియడ్) ముగిసిన పాలసీదారులకు ఎల్‌ఐసీ అదనపు గడువును ఇచ్చింది. నవంబర్ 30లోగా ప్రీమియం చెల్లిస్తే వీరికి ఎలాంటి అదనపు రుసుములు విధించబోమని ప్రకటించింది.

తెలంగాణలో రిజిస్ట్రేషన్లు పాతనోట్లతో ఓకే
వివిధ రకాల చెల్లింపులకు ఈ నెల 24వరకు పాత నోట్లను కేంద్రం అనుమతించిన రీత్యా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ప్రజలకు సూచించారు. పాత నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని ఆయన బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. అంతకు ముందు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, రూ.2000 నోట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.పెద్ద నోట్ల రద్దుతో రాష్ర్టానికి భారీగా ఆదాయం తగ్గిందని, మరోవైపు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గించారని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజులు, చార్జీలు, పన్నులు, పెనాల్టీలు ఏవైనా ఈ నెల 24వరకు పాత రూ.500, రూ.1000 నోట్లతో చెల్లించుకోవచ్చునని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ రాష్ట్ర ప్రజలకు సూచించారు. రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారు, వాణిజ్యపన్నులు చెల్లించేవారు, మంచినీటి బిల్లులు కట్టేవారు, విద్యుత్ బకాయిలు చెల్లించేవారు కూడా పాత నోట్లను ఉపయోగించవచ్చునని ప్రకటించారు.

బాకీ రద్దు చేసినట్లు కాదు: జైట్లీ
మొండి బకాయిలను రద్దు చేస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడంతో పార్లమెంట్‌లో విపక్షాలు మండిపడ్డాయి. దీంతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. ‘ఎస్‌బీఐ రద్దు చేసినవి కేవలం మొండి బకాయిలు మాత్రమే. అది వాళ్ల రిజిస్టర్‌లో రాసుకోవడానికి మాత్రమే. అంతేకానీ ఈ చర్యకు అర్థం రుణ మాఫీ చేసినట్లు కాదు, అపుల్ని వసూలు చేయకుండా వదిలేస్తామనీ కాదు. రుణం వసూలు చేసే చర్యలు కొనసాగుతాయని' అని జైట్లీ రాజ్యసభలో పేర్కొన్నారు.

ఐటీ వృద్ది రెండంకెల్లోకి చేరబోదు: నాస్కామ్
దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం సమీప భవిష్యత్తులో నిరాశాజనకంగా ఉండేట్లు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల్లో వృద్ధి 8-10 శాతం మధ్యలోకి జారుకునే అవకాశం ఉందని ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ అంచనావేస్తున్నది. ప్రపంచ స్థూల ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటం, బ్రెగ్జిట్ నేపథ్యంలో దేశీయ ఐటీ ఇండస్ట్రీపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదని పేర్కొంది. ఐటీ రంగ వృద్ధి 10-12 శాతం మధ్యలో నమోదవ నున్నదని గతంలో నాస్కామ్ అంచనావేసింది. అంతర్జాతీయ దేశాల్లో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితికి తోడు బ్రెగ్జిట్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కరెన్సీలలో కొనసాగుతున్న అస్థిరత, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ సంస్థలు ఐటీపై పెట్టే ఖర్చులు తగ్గుముఖం పట్టడంతో ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం పడటానికి కారణమవుతున్నాయని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖరన్ తెలిపారు.

భారత రేటింగ్ యథాతథం: మూడీస్
భారత సావరిన్ రేటింగ్‌ను బుధవారం సానుకూల అవుట్ లుక్‌తో బీఏఏ3 రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు నిర్ణయించింది గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్. రేటింగ్ మరింత పెరగడానికి మరిన్ని ప్రభావవంతమైన ప్రభుత్వ సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. మున్ముందు ఆ దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేసింది. కాగా, బీఏఏ3 రేటింగ్ పెట్టుబడులకు దిగువ శ్రేణిది. దీంతో మూడీస్ తాజా రేటింగ్‌పై కేంద్ర ప్రభుత్వం పెదవి విరిచింది. ఇంతకుముందు స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పి) రేటింగ్‌పైనా కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసినది తెలిసిందే.

ఓలా పోస్ట్‌పెయిడ్ సేవలు ప్రారంభం
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా..పోస్ట్‌పెయిడ్ సర్వీసులను సైతం ప్రారంభించింది. క్యాబ్ సేవలను వాడుకున్న వారం రోజుల లోపు చెల్లింపులు జరిపే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించింది. పెద్దనోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కరెన్సీ నోట్ల విషయంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. కీలకమైన కార్పొరేట్ క్లయింట్లు, క్యాబ్‌ను అత్యధికసార్లు వినియోగించిన వినియోగదారులు ఎదుర్కొంటున్న అవాంతరాలను తొలగించేందుకు ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీలు జరిపేందుకు సంస్థ మనీ ఈ-వాలెట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

పెరిగిన బంగారం ధరలు
బుధవారం స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 31,230 గాను, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,200గాను ఉంది.

డాలరుతో 20 పైసలు తగ్గిన రూపాయి
బుధవారం డాలరుతో రూపాయి మారకం విలువ 20 పైసలు క్షీణించి 67.94కు చేరింది. ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థాయి. ఈ నెల 10 నుంచి చూస్తే రూపాయి 151 పైసలు తగ్గింది. మొత్తం 2శాతం నష్టపోయింది. విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నందున బ్యాంకులు, దిగుమతిదార్ల కారణంగా వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ రూపాయి బలహీనపడింది.

కార్పొరేట్ పన్నును 25%కి తగ్గించాలి: అసోచామ్
ప్రీబడ్జెట్ సెషన్లో భాగంగా ఆర్థికమంత్రితో జరిగిన సమావేశంలో కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించాలని అసోచామ్ అడిగింది. రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియాతో అసోచామ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. జీఎస్‌టీలో 3 రకాల పన్నులు ఉండటం మూలంగా అది మరిన్ని పన్ను వర్గీకరణ వివాదాలకు దారితీస్తుందని అసోచామ్ అభిప్రాయపడింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..



Click it and Unblock the Notifications