మీరు బ్యాంకుకు లేదా ఏటీఎమ్‌కు వెళ్లాల్సిన పనిలేదు, ఈ విధంగా చేశారంటే
నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పల్లె, పట్టణం తేడా లేకుండా ఏటీఎమ్, బ్యాంకుల ముందు బారులు తీరి ఉండటాన్ని చూస్తున్నాం. మీరు స్మార్ట్ ప్రజలు అయితే ఇలా
నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి దేశవ్యాప్తంగా పల్లె, పట్టణం తేడా లేకుండా ఏటీఎమ్, బ్యాంకుల ముందు బారులు తీరి ఉండటాన్ని చూస్తున్నాం. మీరు స్మార్ట్ ప్రజలు అయితే ఇలా చేయరు. మీ రోజువారీ అవసరాలను ఇబ్బందులు లేకుండా తీర్చుకునేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తారు. మంచి పేమెంట్ వాలెట్లను ఉపయోగించి మీ పనిని సులభతరం చేసుకోండి. ఇక్కడ సినిమా టిక్కెట్ల, బిల్లు చెల్లింపులపై వచ్చే రాయితీలను తెలుసుకోండి.
పేటీఎమ్ వాలెట్-
పేమెంట్ వ్యాలెట్ల చరిత్రలో పేటీఎమ్ రాజు లాంటిది. మొబైల్ రీచార్జీ, డేటా రీచార్జీ, డీటీహెచ్ రీచార్జీ, విద్యుత్ బిల్లు చెల్లింపు, సినిమా టిక్కెట్ల బుకింగ్, నీటి బిల్లు చెల్లింపు, బ్రాడ్‌బ్యాండ్ బిల్లు, ఫ్లైట్ బుకింగ్, బస్, హోటల్ బుకింగ్‌లు, రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడం వంటివన్నీ ఇక్కడ ఒకచోట నుంచే నిమిషాల్లో పూర్తిచేసుకోవచ్చు.
మొబిక్విక్ వాలెట్-
సరళమైన, వేగవంతమైన ఎటువంటి ఆటంకాలు లేని సేవలందించే మొబైల్ వ్యాలెట్లలో మొబిక్విక్ ఒకటి. దీంతో మీరు షాపింగ్ చేసి బిల్లు చెల్లించవచ్చు. విద్యుత్ బిల్లు చెల్లింపు, మొబైల్, డీటీహెచ్ రీచార్జీలతో పాటు బస్సు,రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
వన్ఇండియా రీచార్జీ సేవలను ప్రయత్నించండి

ఫ్రీచార్జీ వ్యాలెట్
మొబైల్; ల‌్యాండ్‌లైన్, విద్యుత్,గ్యాస్ బిల్లులు చెల్లించాలనుకుంటున్నారా? అయితే ఫ్రీచార్జీని ప్రయత్నించవచ్చు. దీంతో మెట్రో స్మార్ట్ కార్డ్ రీచార్జీ సైతం చేసుకోవచ్చు. బ్రాడ్‌బ్యాండ్ బిల్లు చెల్లించవచ్చు. అదనపు క్యాష్‌బ్యాక్‌ల కోసం వన్ఇండియా కూపన్స్ అందించే ఉచిత కూపన్లను ఉపయోగించుకోవచ్చు.
అమెజాన్ గిఫ్ట్ కార్డ్
అమెజాన్ గిఫ్ట్ కార్డును ఉపయోగించి అమెజాన్ ఇండియాలో చింత లేని షాపింగ్ చేయవచ్చు. రోజువారీ అవసరాలను అమెజాన్ ప్యాంట్రీలో కొనుక్కొని డబ్బు పొదుపు చేసుకోవచ్చు. ఇదంతా నగదు రహిత షాపింగ్.
పేయూమనీ
వ్యాలెట్ చెల్లింపు పద్దతిని పేయూమనీ సులభతరం చేసింది. వారి వెబ్‌సైట్లో నమ్మకమైన, యాక్టివ్‌గా ఉండే 2,39,000 వేల అమ్మకందార్లు ఉన్నారు. పేమెంట్ గేట్‌వేలో పేయూమనీని వాడటం ద్వారా సులభమైన బిల్లింగ్ మార్గాన్ని ఎంచుకోండి.


Click it and Unblock the Notifications