సెన్సెక్స్ ఉదయం 200 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు సానుకూలంగా ఉండటం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో భారత్‌తో పాటు ఆసియా మార్కెట్లన్నీ లాభ
సెన్సెక్స్ ఉదయం 200 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు సానుకూలంగా ఉండటం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో భారత్‌తో పాటు ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లోనే పయనిస్తున్నాయి.
ఒక్క షాంఘై కాంపోజిట్ సూచీ తప్ప ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. నికర లాభంలో 78.3% మెరుగుదల కనబరచడంతో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్ 3.6% పెరిగి 838.55కు చేరింది. లాభాల్లో కొనసాగుతున్న వాటిలో ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, మారుతి ఉన్నాయి. మంగళవారం దాదాపు 9% నష్టపోయిన టాటామోటార్స్ ఈ రోజు లాభాల్లో ఉంది. నల్లధనం కట్టడి చర్యల వల్ల బాగా నష్టపోయిన మిడ్‌క్యాప్ షేర్లు కోలుకున్నాయి. మిడ్‌క్యాప్ సూచీ దాదాపు 2శాతానికి పైగా పైకి ఎగిసింది. మిడ్‌క్యాప్ షేర్లలో టాటా గ్లోబల్ బేవరేజెస్, ఫెడరల్ బ్యాంకు,3 నుంచి 5 శాతం పైగా లాభపడ్డాయి.