ఎగవేతదార్ల రుణాలను మాఫీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పన్నుల ఎగవేతదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. డెయిలీ న్యూస్ అండ్ అనాలసిస్(డీఎన్ఏ) కథనం ప్రకారం 63 మంది పన్ను ఎగవేతదారుల రు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పన్నుల ఎగవేతదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. డెయిలీ న్యూస్ అండ్ అనాలసిస్(డీఎన్ఏ) కథనం ప్రకారం 63 మంది పన్ను ఎగవేతదారుల రుణాలను రద్దు చేసినట్లు సమాచారం. మొత్తం రూ. 7,106 కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు ఎస్‌బీఐ ప్రకటించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఎస్‌బీఐ రద్దు చేసిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బకాయిదారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్దేశపూర్వక ఎగవేతదారులు
విక్టరీ ఎలక్ట్రికల్స్- రూ.93.91 కోట్లు,
కేఆర్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు రూ.86.73 కోట్లు
విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్ లిమిటెడ్- రూ. 65.57 కోట్లు
ఘనశ్యామ్ దాస్ జెమ్స్& జ్యువెలర్స్- రూ. 61.72 కోట్లు