భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 514 పాయింట్లు నష్టపోయి 26,304 వద్ద ముగిసింది. నిఫ్టీ 187.85 పాయింట్ల నష్టంతో 8,108.45 వద్ద ముగిసింది. క్రితం సెషన్లో శుక్రవారం కూ
దేశీయ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 514 పాయింట్లు నష్టపోయి 26,304 వద్ద ముగిసింది. నిఫ్టీ 187.85 పాయింట్ల నష్టంతో 8,108.45 వద్ద ముగిసింది. క్రితం సెషన్లో శుక్రవారం కూడా స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 699 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 229.45 పాయింట్ల నష్టంతో 8,300 పాయింట్లకు దిగువకు పడిపోయిన సంగతి తెలిసిందే.

మంగళవారం ఉదయం నష్టాలతోనే స్టాక్‌మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఏకంగా 316.61 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనించి 111.80 పాయింట్ల నష్టాన్ని చవి చూసింది. ఆ తర్వాత తీవ్ర ఒడిదొడుకులకు లోనైన మార్కెట్ ఏ దశలోనూ కోలుకోలేదు. మదుపరుల నుంచి అమ్మకాల ఒత్తిడి, అమెరికన్ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచగలదన్న భయాలు మార్కెట్లను కుదిపేశాయి. పెద్దనోట్ల రద్దు కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావమే చూపింది. ట్రంప్ విధానాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయన్న అంచనాలతో డాలర్ బలపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్‌లు కుదేలైపోయాయి. రియల్టీ , ఆటో మెటల్స్ రంగాలు కుప్పకూలగా ఫార్మా స్వల్ప నష్టాలను, ఐటీ, ప్రభుత్వ బ్యాంకు షేర్లు మాత్రం స్వల్ప లాభాలను నమోదు చేశాయి.
మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఎస్‌బీఐ, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, హెచ్‌యూఎల్ షేర్లు లాభపడగా, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల చవిచూశాయి.


Click it and Unblock the Notifications