పెద్ద నోట్ల రద్దుతో ఏటీఎమ్, బ్యాంకుల ముందు వరుస కడుతున్న జనాన్ని రోజూ చూస్తూనే ఉన్నాం. చాలా మంది విసుగెత్తి ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని పలు మొబైల్ వాలెట్
పెద్ద నోట్ల రద్దుతో ఏటీఎమ్, బ్యాంకుల ముందు వరుస కడుతున్న జనాన్ని రోజూ చూస్తూనే ఉన్నాం. చాలా మంది విసుగెత్తి ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని పలు మొబైల్ వాలెట్ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తున్నాయి. వీటిలో పేటీఎం, ఫ్రీచార్జ్, మొబిక్విక్ వంటివి సైతం ఉన్నాయి.

ఏ బ్యాంకు ఖాతాకైనా ఎలాం టి రుసుము లేకుండా నగదును బదిలీ చేసుకోవచ్చని మొబిక్విక్ ప్రకటించింది. ఈ ఆఫర్ రిటైలర్లు, షాప్‌కీపర్లకు ఎక్కువగా ఉపయోగం ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇంతకు ముందు మొబిక్విక్ మొబైల్ వాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు నగదును బదిలీ చేస్తే 4 శాతం ఫీజును వసూలు చే సేవారు. ఇప్పుడు మాత్రం చార్జీలను వసూలు చేయడం లేదు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి లావాదేవీలు 18 రెట్లు పెరిగినట్టు మొబిక్విక్ తెలిపింది. ఇక పేటీఎంద్వారా చెల్లింపుల లావాదేవీల సంఖ్య 50 లక్షలు దాటింది. దాదాపు 24,000 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. పేటీఎం వెబ్‌సైట్,యాప్‌లకు ట్రాఫిక్ 700 శాతం పెరిగిందని, వాలెట్‌లో యాడ్ చేసే సొమ్ము 1,000 శాతం పెరిగిందని సంస్థ పేర్కొంది. వివిధ రకాల చెల్లింపుల కోసం వాలెట్‌ను ఉపయోగించుకొమ్మని ఈ సంస్థ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.


Click it and Unblock the Notifications