ఒకే వ్యక్తి దగ్గర రూ. 6వేల కోట్లా?
అవినీతి, నల్లధనంపైన మోదీ ప్రకటించిన యుద్ధానికి మంచి ఫలితాలు వస్తున్నట్లే కనిపిస్తున్నాయి. సూరత్‌కు చెందిన ఒక స్థిరాస్తి, వజ్రాల వ్యాపారి రూ. 6 వేల కోట్ల రూపాయలను స్వాధీనపరిచినట్లు త
అవినీతి, నల్లధనంపైన మోదీ ప్రకటించిన యుద్ధానికి మంచి ఫలితాలు వస్తున్నట్లే కనిపిస్తున్నాయి. సూరత్‌కు చెందిన ఒక స్థిరాస్తి, వజ్రాల వ్యాపారి రూ. 6 వేల కోట్ల రూపాయలను స్వాధీనపరిచినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే అతడు రూ. 5400 కోట్లను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. (30% పన్ను, ట్యాక్స్‌పైన 200% పెనాల్టీ) దీనిపై మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

పత్రికల్లో పతాక శీర్షికల్లో
దేశంలోనే అతిధనవంతమైన బిల్డర్ల, వజ్రాల వ్యాపారస్థుల్లో ఆయనొకరు. అతని సేవాతత్పరతకు, ఉద్యోగులకు విలువైన బహుమతులివ్వడంతో ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆడపిల్లల చదువుల కోసం రూ. 200 కోట్లను దానం చేశారు. ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు మొదలైనవి బహుమతులుగా ఇచ్చేశారు. ఇలా ఎన్నోసార్లు పత్రికల్లో పతాక శీర్షికలెక్కారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి ఆయన పేరున్న వివాదస్పద సూట్‌ను సైతం కొన్నది ఈయనే.

ఇదే అత్యధిక సొమ్ము
ఈయనకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న అరెస్టులు, రికవరీలు, రైడ్లలో ఎంతో లెక్కలోకి రాని ధనం వివరాలు వెల్లడవుతున్నాయి. అవినీతి వ్యక్తుల గురించి తెలుస్తోంది. అన్నింటిలోకి ప్రస్తుతానికి ఇదే(6వేల కోట్లు) అత్యధిక సొమ్ముగా ఉంది. ఈ సంఘటనలే కాకుండా ఎన్నో చోట్ల నోట్లను చింపి పడేసిన అంశాలు మీడియా ద్వారా ప్రజల దృష్టికి వస్తున్నాయి. మరికొన్న చోట్ల నోట్లను కాల్చేస్తున్నారు. గంగానదిలో నోట్లను పడేసిన వార్త పత్రికల్లో వచ్చింది.
వివిధ దేశాల కరెన్సీ మారకపు విలువలను తెలుసుకోండి

క్లీన్ గంగా ఫండ్ కోసం విరాళం
క్లీన్ గంగా ఫండ్ కోసం రూ.4.31 కోట్ల చెక్కును ఇచ్చారు. ధర్మనందన్ డైమండ్స్‌కు అధిపతి ఆయన. ఆయన పేరే లాల్‌జీ పటేల్. ప్రధానమంత్రి సూట్‌ను 4.31 కోట్లకు దక్కించుకున్నారు.

పెద్ద నోట్ల రద్దు
రూ. 500, రూ. 1000 నోట్లను దేశవ్తాప్తంగా రద్దు చేస్తూ ప్రధానమంత్రి నవంబరు 8న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఒక పక్క సామాన్యుడు అవస్థలు పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం నల్లధనం, అవినీతిపరుల బండారం భయటపడుతుందని భరోసాతో ఉంది. ఈ నేపథ్యంలో ఇంకెన్ని సంచలనాలు చూస్తారో ప్రజలు.


Click it and Unblock the Notifications