విజయ్ మాల్యా ఆస్తుల జప్తు
కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో షాకిచ్చింది. ఆయనకు చెందిన రూ.1,620 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. మాల్యా ఐడీబీఐ బ్యాంకులో తీసుకున్న అప్ప
కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో షాకిచ్చింది. ఆయనకు చెందిన రూ.1,620 కోట్ల ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. మాల్యా ఐడీబీఐ బ్యాంకులో తీసుకున్న అప్పులో భారీ అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ.
మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాపై పీఎంఎఎల్‌ఏకు లోబడి దేశవ్యాప్తంగా ఉన్న రూ. 1,620 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

మాల్యాకు చెందిన అన్ని ఆస్తులను జప్తు చేయాలని పీఎంఎల్‌ఏ కోర్టు జడ్జి పీఆర్ భావకే ఈడీని ఆదేశించిన నేపథ్యంలో దూకుడు పెంచింది. ఇప్పటికే రూ.8,041 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను జప్తు చేసిన ఈడీ..తాజాగా మరో రూ.1,620 కోట్లను స్వాధీన పరుచుకున్నది. క్రిమినల్ ప్రొక్యూడర్ కోడ్(సీఆర్‌పీసీ) చట్టానికి లోబడి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మాల్యాకు విదేశాల్లో ఉన్న ఆస్తులను జప్తు చేయాలన్న ఈడీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తులను మాత్రమే జప్తు చేయాలని, ఆయా దేశాల్లో ఉన్న చట్టాలకు లోబడి నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకే స్తంభింప చేసిన, తనఖా పెట్టిన మాల్యా షేర్లను జప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.ఐడీబీఐ బ్యాంక్ వద్ద మాల్యా తీసుకున్న రూ.900 కోట్ల నిధుల్లో అవకతవకలు జరిగినట్లు ఈడీ ఆరోపిస్తున్నది.


Click it and Unblock the Notifications