పెద్ద నోట్ల ర‌ద్దుతో ఎక్క‌డ ఏం జ‌ర‌గ‌బోతోంది?

2007లో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ది కంటే దేశంలో జ‌రుగుతున్న న‌ల్ల‌ధ‌నం, అక్ర‌మ క‌రెన్సీ ఎక్కువ‌గా ఉంద‌ని ప్ర‌పంచ బ్యాంకు బ‌య‌ట‌పెట్టింది. స‌మాంత‌ర ఆర్థిక వ్య‌వ‌స్థ కార‌ణంగా జీడీపీలో దాని వృద్ది 23.2 శ

2007లో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ది కంటే దేశంలో జ‌రుగుతున్న న‌ల్ల‌ధ‌నం, అక్ర‌మ క‌రెన్సీ ఎక్కువ‌గా ఉంద‌ని ప్ర‌పంచ బ్యాంకు బ‌య‌ట‌పెట్టింది. స‌మాంత‌ర ఆర్థిక వ్య‌వ‌స్థ కార‌ణంగా జీడీపీలో దాని వృద్ది 23.2 శాతంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. అదే నిష్ప‌త్తి ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న‌ట్లు భావిస్తే లెక్క‌లోకి రాని ధ‌నం విలువ 479 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గ‌ల‌దు. ఈ డ‌బ్బంతా ప్ర‌స్తుతం ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి రాగ‌ల‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. హ‌ఠాత్తుగా ప్ర‌భుత్వం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయడం జీడీపీకి మంచి చేయ‌గ‌ల‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీర్ఘ‌కాలంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ప‌న్ను విధానాల‌కు ఇది మంచి చేయ‌గ‌ల‌ద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ అనూహ్య నిర్ణ‌యం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను క్రిసిల్ అంచ‌నా వేసింది. వాటిని ఈ కింద తెలుసుకోండి.

సూక్ష్మ ఆర్థిక వ్య‌వ‌స్థ స్వ‌రూపం

సూక్ష్మ ఆర్థిక వ్య‌వ‌స్థ స్వ‌రూపం

మ‌ధ్య కాలం నుంచి దీర్ఘ‌కాలంలో ప్ర‌భుత్వ రాబడులు పెరుగుతాయి. ప్ర‌భుత్వానికి వ‌చ్చే ప‌న్నులపై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం కార‌ణంగా ప‌న్ను వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం ఉంది. దీంతో మౌలిక రంగంపై కేంద్రం వెచ్చించే పెట్టుబ‌డుల్లో వృద్ది సంభ‌విస్తుంది. ఇది దేశ జీడీపీ వృద్దికి దోహ‌దం చేయ‌గ‌ల‌దు. లావాదేవీలు త‌గ్గుతాయ‌ని భావిస్తున్నందున స్వ‌ల్ప‌కాలంలో ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గుముఖం ప‌డుతుంది. త‌ర్వాత ప్ర‌భుత్వం సంక్షేమ కార్య‌క్ర‌మాలు, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఉపాధి కార్య‌క్ర‌మాల‌పై పెట్టుబ‌డులు పెంచ‌డం మూలంగా ఉద్యోగ అవ‌కాశాలు, ఆదాయాలు పెరిగి డిమాండ్ పుంజుకుంటుంది. దీంతో మ‌ధ్య‌కాలం నుంచి దీర్ఘ‌కాలంలో ద్ర‌వ్యోల్బ‌ణం త‌టస్థంగా ఉండ‌గ‌ల‌దు.

ట్యాక్స్-జీడీపీ నిష్ప‌త్తి

ట్యాక్స్-జీడీపీ నిష్ప‌త్తి

అన్ అకౌంటెడ్ నిధుల‌న్నీ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి ప్ర‌వేశించే వీలున్నందు వ‌ల్ల ఆదాయ‌పు ప‌న్ను వ‌సూళ్లు పెరుగుతాయి. మొద‌టిసారి ప‌న్ను వ‌సూళ్ల‌పై ఉన్న ప్ర‌భావం వ‌ల్ల ప‌న్ను వ‌సూళ్లు ఎక్కువ‌వుతాయి. దీర్ఘ‌కాలంలో స‌రైన ప‌న్ను వ్య‌వ‌స్థ‌, న‌గ‌దు లావాదేవీల‌ను డిస్‌క‌రేజ్ చేయ‌డం వంటి వాటి మూలంగా ప్ర‌త్య‌క్ష ప‌న్ను వ‌సూళ్లు మ‌ధ్య కాలం(మీడియం ట‌ర్మ్‌)లో పెరుగుతాయి. ఆదాయ వ‌న‌రును బ‌ట్టి లెక్క‌ల్లేని ఆదాయానికి ప్ర‌భుత్వం 30 నుంచి 120 శాతం వ‌ర‌కూ ప‌న్ను లేదా పెనాల్టీ ఉంటుంద‌ని ఇదిర‌కే పేర్కొంది. ప్ర‌స్తుతం మొత్తం ప‌న్ను వ‌సూళ్ల‌లో జీడీపీ మొత్తంలో ప్ర‌త్య‌క్ష ప‌న్ను వ‌సూళ్ల వాటా కేవ‌లం 5% మాత్ర‌మే. ఇది బాగా పెరుగుతుంద‌ని అనుకుంటున్నారు.

ప్ర‌భుత్వ పెట్టుబ‌డులు పెరుగుతాయి: ఉద్యోగాలు, ఆదాయాలు పైకి

ప్ర‌భుత్వ పెట్టుబ‌డులు పెరుగుతాయి: ఉద్యోగాలు, ఆదాయాలు పైకి

గ‌త రెండేళ్ల‌లో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పొదుపు పెర‌గ‌డం మూలంగా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు చేసే పెట్టుబ‌డులు పెరిగాయి. చ‌మురు రంగ సబ్సిడీల‌ను త‌గ్గించుకోవ‌డం వ‌ల్ల ఇది సాధ్య‌మైంది. ప్ర‌యివేటు పెట్టుబ‌డులు బ‌ల‌హీనంగా ఉన్న ఈ స‌మ‌యంలో ఇది క‌చ్చిత అవ‌స‌రం. దీంతో ఉద్యోగాలు, స‌గ‌టు మ‌నిషి ఆదాయాలు పెరిగాయి. 2013 లో ఒక నివేదిక ప్ర‌కారం 2012 సంవ‌త్స‌రంలో దేశంలో జ‌రుగుతున్న మొత్తం లావాదేవీల్లో న‌గ‌దు రూపంలో జ‌రుగుతున్న వాటి శాతం 86గా ఉంది. ఎల‌క్ట్రానిక్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ న‌గ‌దు లావాదేవీలు త‌గ్గుతుంటాయి. ప్ర‌భుత్వం ఉపాధి హామీ కూలీల‌కు చెల్లిస్తున్న వేత‌నాల‌ను సైతం బ్యాంకు ఖాతాల్లోనే జ‌మ చేస్తోంది.

ప‌న్ను రేట్లు త‌గ్గే అవ‌కాశం

ప‌న్ను రేట్లు త‌గ్గే అవ‌కాశం

స‌రైన ప‌న్ను వ్య‌వ‌స్థ‌ ఆదాయ‌పు ప‌న్ను వ‌సూళ్లు పెరిగితే దీర్ఘ‌కాలంలో ఆదాయ‌పు ప‌న్ను రేట్లు త‌గ్గొచ్చు. అంతేగాక వెల్ల‌డించే ఆదాయాలు సైతం ఎక్కువ అవుతాయి. ఇందు మూలంగా వినియోగ వ్యయం పెరిగి, వృద్ది రేటుపై సానుకూల ప్ర‌భావ‌మే ఉండ‌గ‌ల‌దు.

ద్ర‌వ్యోల్బ‌ణంపై తిరోగ‌మ‌న ప్ర‌భావం

ద్ర‌వ్యోల్బ‌ణంపై తిరోగ‌మ‌న ప్ర‌భావం

వ‌చ్చే కొన్ని నెలల్లో న‌గ‌దు ప్ర‌వాహం త‌క్కువ అవుతుంది. దీంతో డిమాండ్ త‌గ్గి ద్ర‌వ్యోల్బ‌ణంపై రుణ ప్ర‌భావ‌మే ఉంటుంది. గృహ రంగం, ర‌వాణా, ఆహారం వంటి వాటిపై వెచ్చించే డ‌బ్బు పెరిగి వాటి ధ‌ర‌ల‌పై ఒత్తిడి ప‌డుతుంది. ప‌ట్ట‌ణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో న‌గ‌దు లావాదేవీలు ఒక్క‌సారిగా త‌గ్గే వీలుంది. త‌ర్వాత ప్ర‌భుత్వ వ్య‌యం దీర్ఘ‌కాలంలో పెరుగుతుంద‌ని తెలుస్తోంది. మొత్తానికి మ‌ధ్య కాలం నుంచి దీర్ఘ‌కాలంలో ద్ర‌వ్యోల్బ‌ణంపై ప‌డే ప్ర‌భావం త‌ట‌స్థంగా ఉండ‌గ‌ల‌దు.

క‌రెంటు ఖాతా లోటు

క‌రెంటు ఖాతా లోటు

పాల‌సీల్లో జ‌రిగిన మార్పుల మూలంగా ఇదివ‌ర‌కే బంగారానికి డిమాండ్ త‌గ్గింది. ప్ర‌స్తుత నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం కార‌ణంగా బంగారు దిగుమ‌తులు మ‌రింత త‌గ్గేలా చేయ‌గ‌ల‌వు. ఎందుకంటే వ్య‌వ‌స్థలో న‌గ‌దు ప్ర‌వాహం త‌క్కువ ఉంటుంది కాబ‌ట్టి. అయితే ప్ర‌జ‌లు న‌గ‌దు కంటే ఎక్కువ బంగారంపై మోజు చూపితే క‌రెంటు ఖాతా లోటు పెరిగే అవ‌కాశాన్ని కొట్టి పారేయ‌లేం.

రంగాల వారీగా

రంగాల వారీగా

న‌గ‌దు ప్ర‌వాహం బాగా త‌గ్గ‌డం వ‌ల్ల చాలా రంగాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావ‌మే ఎక్కువ ఉండ‌గ‌ల‌దు. వ్య‌వ‌స్థ‌లో ఉన్న 86% క‌రెన్సీ వాణిజ్య అవ‌సరాల‌కు ప‌నికి రాకుండా హ‌ఠాత్తుగా ర‌ద్దవ్వ‌డం వ‌ల్ల మొత్తం ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌త్య‌క్ష ప్ర‌భావం ఉంటుంది. న‌గ‌దు ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉండే రంగాలైన స్థిరాస్తి, బంగారు న‌గ‌లు, ఆభ‌ర‌ణాలు; రెస్టారెంట్లు, హోట‌ళ్లు ; స‌ర‌కు ర‌వాణా; వినియోగదారు వ‌స్తువులు(క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌); విలాస వ‌స్తువులు; సిమెంటు వంటి వాటిపై ప్ర‌భావం త‌క్ష‌ణ‌మే ఉంటుంది. రిటైల్ లేదా సూక్ష్మ‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల రంగంలో కొన్ని స్వ‌ల్ప‌కాలంలో ఇబ్బందుల‌కు గుర‌వుతాయి. ఎందుకంటే ఇవి నిత్యం న‌గ‌దు లావాదేవీల‌తోనే న‌డుస్తుంటాయి. సిమెంటుపై ప‌రోక్ష ప్ర‌భావం ఎక్కువ‌. ఎందుకంటే ఈ రంగంలో జ‌రిగే వినియోగానికి స్థిరాస్తి రంగంలో 60శాతం సంబంధం ఉంటుంది. ప్ర‌స్తుత న‌గ‌దు క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌తో పాటు జీఎస్‌టీ వ‌స్తే వ్య‌వ‌స్థీకృత రంగంలో జ‌రిగే లావాదేవీలు పెరిగి స్థిరాస్తి ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని భావిస్తున్నారు.

స్థిరాస్తి రంగంపై

స్థిరాస్తి రంగంపై

దేశ రాజ‌ధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌) లాంటి అత్య‌ధిక డిమాండ్ ఉన్న న‌గ‌రాలు తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌వుతాయి. స్థిరాస్తి నియంత్ర‌ణ బిల్లు, జీఎస్‌టీల ప్ర‌భావం దీనికి అద‌నం. అవ్య‌వ‌స్థీకృత డెవ‌ల‌ప‌ర్లు ఉండే గృహ నిర్మాణ మార్కెట్లో వారు ఈ రంగంలో నిల‌దొక్కుకునే అవ‌కాశం లేకుండా ఇబ్బందుల‌కు గుర‌వుతారు. దీంతో రియ‌ల్ ఎస్టేట్‌లో గృహ నిర్మాణ రంగానికి కాస్త డిమాండ్ త‌గ్గుతుంది. స్వ‌ల్ప కాలం నుంచి మ‌ధ్య కాలానికి డెవ‌ల‌ప‌ర్లు న‌గ‌దు కొర‌త‌ను ఎదుర్కొంటారు. దీంతో ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉన్న ప్రాజెక్టులు ఇంకా ఆల‌స్య‌మ‌వుతాయి. భూమి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గే వీలుంది. రియ‌ల్ ఎస్టేట్ రెగ్యులేట‌రీ(స్థిరాస్తి నియంత్ర‌ణ‌) బిల్లుతో పార‌ద‌ర్శ‌క‌త‌కు చోటు ద‌క్కుతుంది. మొత్తం ప్ర‌భావాల కార‌ణంగా ఈ రంగంలో కొంత మంది పెద్ద డెవ‌ల‌ప‌ర్లు మాత్ర‌మే నిల‌దొక్కుకునేందుకు ప‌రిస్థితులు దారితీస్తాయి.

రిటైల్ జెవ‌ల‌రీ (న‌గ‌లు, ఆభ‌ర‌ణాల వ్యాపారం)

రిటైల్ జెవ‌ల‌రీ (న‌గ‌లు, ఆభ‌ర‌ణాల వ్యాపారం)

దీర్ఘ‌కాలంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. పెద్ద నోట్ల ర‌ద్దును బంగారు వ‌ర్త‌కుల ప‌రిశ్ర‌మ స్వాగ‌తించింది. ఇప్పుడు చాలా మందికి సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డిగా బంగారం అవుతుంద‌ని వారు చెబుతున్నారు. దీంతో దీర్ఘ‌కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మ‌దుపు చేసేవారు బంగారం వైపు మ‌ళ్లుతార‌ని ఊహిస్తున్నారు. అయితే అవ్య‌స్థీకృత బంగారు వ్యాపారుల‌కు పెద్ద నోట్ల ర‌ద్దు శ‌రాఘాతంగా ప‌రిణ‌మించ‌గ‌ల‌ద‌ని అంచ‌నా. వ్య‌వ‌స్థీకృత వ్యాపారంలో ఉన్న బంగారు, ఆభ‌ర‌ణాల వ‌ర్త‌కులు మార్కెట్లో స‌మూల మార్పున‌కు శ్రీ‌కారం చుట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే గ్రామీణ ప్ర‌జ‌లపై ప‌డే ప్ర‌భావాన్ని ఇప్పుడే అంచ‌నా వేయలేం.

బ్యాంకులు,బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు

బ్యాంకులు,బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు

డిపాజిట్ల సేక‌ర‌ణ‌, అప్పులిచ్చే దృక్ప‌థంతో చూసిన‌ప్పుడు బ్యాంకుల‌కు ఇది లాభించే విష‌యం. హ‌ఠాత్తుగా నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డం మూలంగా అందరు ఇదివ‌ర‌కూ చేసుకున్న పొదుపు దాదాపుగా బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి రాగ‌ల‌దు. స్వ‌ల్ప‌కాలంలో ఆస్తుల నాణ్య‌త‌పై ప్ర‌భావం ప‌డ‌గ‌ల‌దు. డిజిట‌ల్ వ్యాలెట్ సేవ‌లందించే పేటీఎమ్‌, ఫ్రీచార్జ్, మొబిక్విక్ వంటి సంస్థ‌లు బ్యాంకులు అందిస్తున్న వ్యాలెట్ల‌కు ఎక్కువ శాతం ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. 2016తో ముగిసిన ఆర్థిక సంవ‌త్స‌రానికి ముందు మూడేళ్ల‌లో మొబైల్ వాలెట్ల ద్వారా జ‌రిగే చెల్లింపులు 20 సార్లు పెరిగాయంటే దీని ప్ర‌భావం ఎంత‌గా ఉంటుందో అంచ‌నా వేయొచ్చు. బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లైన మైక్రోఫైనాన్స్‌, బంగారు రుణ సంస్థ‌లు, వాహ‌ణ రుణ కంపెనీలు స్వ‌ల్ప‌కాలంలో ప్ర‌తికూల ప్ర‌భావాన్ని ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. ఎందుకంటే వీటిల్లో చెల్లింపులు ఎక్కువ‌గా న‌గ‌దు రూపంలో జ‌రుగుతుంటాయి కాబ‌ట్టి. వినియోగ‌దారు వ‌స్తువుల‌పై రుణాల‌నందించే ఫైనాన్సియ‌ర్లు(పాన్ బ్రోకర్లు, వ‌డ్డీ వ్యాపారులు) సైతం స్వ‌ల్ప ఇబ్బందులు ఎదుర్కొన‌వ‌చ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+