400 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
మార్కెట్లో ట్రంప్ ప్రకంపనల నుంచి కొద్దిగా తేరుకుని అంతర్జాతీయ మార్కెట్లన్నీ సానుకూలంగా పయనిస్తున్నాయి. అదే విధంగా దేశీయ మార్కెట్లు సైతం క్రితం నష్టాల నుంచి బయటపడ్డాయి. డోజోన్స్ 200 పాయింట్
మార్కెట్లో ట్రంప్ ప్రకంపనల నుంచి కొద్దిగా తేరుకుని అంతర్జాతీయ మార్కెట్లన్నీ సానుకూలంగా పయనిస్తున్నాయి. అదే విధంగా దేశీయ మార్కెట్లు సైతం క్రితం నష్టాల నుంచి బయటపడ్డాయి. డోజోన్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా వ్యాప్తంగా చూస్తే జపనీస్ నిక్కీ 5% పైగా లాభాల్లో ట్రేడవుతోంది. అదే విధంగా హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 3%పైగా లాభాల్లో ట్రేడవుతోంది. 12.23 గం.ల సమయానికి సెన్సెక్స్ 439(1.61%) లాభంతో 27,691 వద్ద ఉండగా, నిఫ్టీ 153(1.81%) లాభంతో 8585 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌లో ప్రధానంగా లాభపడిన వాటిలో టాటాస్టీల్, ఎస్‌బీఐ, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ ఉన్నాయి. సన్‌ఫార్మా సైతం 2శాతానికి పైగా లాభంలో ఉంది.
నిఫ్టీలో లాభపడిన వాటిలో బోష్(Bosch), హిందాల్కో, సన్‌ఫార్మా, టాటాస్టీల్ ఉన్నాయి.
మరో వైపు 12.28 గం.ల సమయానికి డాలరుతో రూపాయి 2 పైసలు నష్టంతో 66.41 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications