పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను బ్యాంకులకు విడుదల చేసింది. చాలా మందికి ఇవి తెలిసి ఉండకపోవచ్చు. వీటన్నింటిని తెలుసుకోకుండా బ్యాంకులకు వెళితే మీ సమ
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను బ్యాంకులకు విడుదల చేసింది. చాలా మందికి ఇవి తెలిసి ఉండకపోవచ్చు. వీటన్నింటిని తెలుసుకోకుండా బ్యాంకులకు వెళితే మీ సమయం, శ్రమ వృథా అవుతాయి. మీరు బ్యాంకు లేదా పోస్టాఫీసులో అడుగుపెడుతున్నారంటే మీకు ముందుగానే కొంచెం అవగాహన ఉండాలి. మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలివే.
నవంబరు 24 వరకూ మీరు రూ. 4 వేల విలువ కలిగిన నోట్ల వరకూ మాత్రమే మార్పిడి చేసుకోగలరు. అంత కన్నా ఎక్కువ విలువ కలిగిన పెద్ద నోట్లు మీ దగ్గర ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వీలుంది.
మీరు ఇప్పుడిప్పుడే నోట్లను మార్చాలనుకునే ఆత్రం అక్కర్లేదు. డిసెంబరు 30 వరకూ సమయం ఉంది.
ఒక్కో రోజుకు ఏటీఎమ్‌లో విత్‌డ్రా చేసుకోగల డబ్బుకు పరిమితిని రూ. 10 వేలుగా, వారానికి రూ. 20 వేలుగా నిర్ణయించారు.
బ్యాంకు ఖాతాలో పాత నోట్లను డిపాజిట్ చేసే విషయంలో పరిమితి లేదు. వ్యక్తిగత గుర్తింపు చూపించాల్సి ఉంటుంది.
మొదటి దశలో నవంబరు 18 వరకూ ఏటీఎమ్‌ల్లో కార్డు ద్వారా ఒక్కో రోజు రూ. 2వేల వరకూ , తర్వాత నవంబరు 19 నుంచి రూ. 4 వేల వరకూ మాత్రమే తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. తర్వాత నెమ్మదిగా పరిమితిని పెంచుతారు.

ఇంకా మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు
* మీకు పాన్‌కార్డు ఉండి ఎక్కువ డబ్బు డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు తీసుకెళ్లడం మరిచిపోకండి.
* ఒక నిర్దిష్ట ఫారంను పూరించి నోట్లు మార్చుకోవాలి.
* తప్పనిసరిగా వ్యక్తిగత గుర్తింపు కార్డును తీసుకెళ్లండి. ఆ రుజువుగా ఆధార్, డ్రైవింగ్ లెసెన్సు్, వోటర్ గుర్తింపు కార్డు, పాన్‌కార్డు, ప్రభుత్వాలు జారీ చేసే ఇతర గుర్తింపు కార్డులను తీసుకెళ్లవచ్చు.
* మీ డబ్బును నగదు డిపాజిట్ మెషీన్లలో సైతం డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది.
* మీరు స్వయంగా బ్యాంకుకు వెళితే మంచిది. అలా వీలుకాకపోతే మీ తరపున ఎవరినైనా పంపవచ్చు. ఒక మ్యాండేట్ మీద వివరాలను రాసి అనుమతి ఇచ్చినట్లుగా రాతపూర్వకంగా తెలియజేయాలి. ఆయా వ్యక్తులు అనుమతి లేఖతో పాటు వారి వ్యక్తిగత గుర్తింపును బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది.
* మీరు మీ పొదుపు, కరెంట్ ఖాతా కలిగిన బ్యాంకుకు కాకుండా వేరే దానికి వెలుతుంటే గుర్తింపు తప్పనిసరి. మీరు రూ. 4 వేల కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేయాల్సి వస్తే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌కు ఏఏ వివరాలు అవసరమవుతాయో వాటిని తీసుకెళ్లడం మరిచిపోవద్దు.


Click it and Unblock the Notifications