ప్రధానమంత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా పెద్ద నోట్లను రద్దు చేసిన ఒక రోజు తర్వాత బుధవారం అరుణ్‌జైట్లీ ప్రజల ఇబ్బందులపై, ప్రతిపక్షాల విమర్శలపై స్పందించారు. నల్లధనం కట్టడికి ఎన్‌డీఏ ప్
ప్రధానమంత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా పెద్ద నోట్లను రద్దు చేసిన ఒక రోజు తర్వాత బుధవారం అరుణ్‌జైట్లీ ప్రజల ఇబ్బందులపై, ప్రతిపక్షాల విమర్శలపై స్పందించారు. నల్లధనం కట్టడికి ఎన్‌డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేయటం వలన సగటు మనిషి ఇబ్బందులకు గురి అవుతున్నాడంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు అర్థం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా కొనసాగుతున్న నల్లధనాన్ని అదుపు చేసేందుకు కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు.

పెద్ద నోట్లను రద్దు చేసే నిర్ణయం దేశం ఆర్థిక స్వరూప స్వభావాలను మార్చి వేస్తుందని అభిప్రాయపడ్డారు. నిన్నటి వరకు నగదుతో చేసిన పనులను ఈరోజు డెబిట్, క్రెడిట్ కార్డుతో చేసుకోవవచ్చు కదా? అని జైట్లీ సూచించారు. రైతులు ఇబ్బందులకు గురవుతున్నారనటం కూడా నిజం కాదంటూ కొట్టిపారేశారు. నిజాయితీపరులకు ఇవి మంచి రోజులన్న జైట్లీ.. నిజాయితీగా డబ్బు సంపాదించినవారు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. అవినీతి పద్ధతుల్లో డబ్బు సంపాదించిన వారు ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు. నిజానికి 500, 1,000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో ఇచ్చి కొత్త నోట్లు తీసుకోవచ్చునని గుర్తుచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయం మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడటంతోపాటు రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. త ఆరు నెలల నుండే కొత్త నోట్ల ముద్రణ జరుగుతోందని ఆయన వెల్లడించారు. మూడు, నాలుగు వారాల్లో కొత్త నోట్లు చలామణిలోకి వస్తాయని తెలిపారు. ఇక బలహీనమైన అంతర్జాతీయ డిమాండ్.. భారతీయ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద సవాల్ అన్నారు.


Click it and Unblock the Notifications