మీ ఆదాయానికి, మీ దగ్గర ఉన్న డబ్బుకు తేడా ఉందా? అలా ఉండి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే కష్టమే. అందుకు పెనాల్టీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకపై బ్యాంకులో రూ.2.5లక్షల డిపాజిట
మీ ఆదాయానికి, మీ దగ్గర ఉన్న డబ్బుకు తేడా ఉందా? అలా ఉండి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే కష్టమే. అందుకు పెనాల్టీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకపై బ్యాంకులో రూ.2.5లక్షల డిపాజిట్ దాటితే పాన్‌కార్డుతో సహా ఆదాయ మార్గాల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో భారీ మొత్తంలో జరిమానా విధించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అక్రమ సంపాదన అని తేలితే 200 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

50 రోజుల్లో డిపాజిట్లకు సంబంధించిన సమగ్ర నివేదికను ఆధారం చేసుకొని రూ. 2.5లక్షలకుపైగా జమచేసే ప్రతి ఖాతాదారుడి వివరణ తీసుకోనున్నట్లు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హష్మఖ్ ఆధియా తెలిపారు. బంగారు ఆభరణాల కొనుగోలుదారుల నుంచి పాన్‌కార్డు వివరాలను తీసుకోవాల్సిన బాధ్యత జ్యువెలరీ యజమానులదేనని స్పష్టం చేశారు. లేనిపక్షంలో వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వారు సరైన రిటర్న్స్ దాఖలు చేస్తున్నారో లేదో ఐటీ శాఖ అధికారులు కనిపెడతారని అధియా వెల్లడించారు. చిన్న వ్యాపారులు, గృహిణులు, చిరుద్యోగులు.. పన్ను పరిధిలోకి రాని వారు దాచుకునే మొత్తాల గురించి ఎటువంటి ఆందోళన అక్కర్లేదన్నారు. రూ.2లక్షల్లోపు మొత్తాలను జమ చేసేవారిపై ఆదాయపన్ను శాఖ నుంచి ఎటువంటి ఇబ్బందులు రావని భరోసా ఇచ్చారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications