ఈ రోజు బ్యాంకులు, ఏటీఎమ్‌లు పనిచేయవు
నవంబరు 8 అర్ధరాత్రి నుంచి భారత ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు సంసిద్దంగా ఉండేందుకు నవంబరు 9 బుధవారం బ్యాంకులు పనిచేయవు.
నవంబరు 8 అర్ధరాత్రి నుంచి భారత ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు సంసిద్దంగా ఉండేందుకు నవంబరు 9 బుధవారం బ్యాంకులు పనిచేయవు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, విదేశీ, సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణ ప్రజల కోసం పనిచేయవు. బ్యాంకు కార్యకలాపాలు అంతర్గతంగా జరుగుతాయి. ఏటీఎమ్‌లు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు తగిన నగదు ఏర్పాట్లు చేసుకునేందుకు సైతం అవి కూడా పనిచేయవు. ఒకసారి అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఏటీఎమ్‌ల్లో ఒక్కో కార్డు ద్వారా డ్రా చేసే సొమ్మును ఒక్కో రోజుకు నవంబరు 8వ తేదీ వరకూ రూ. 2000 వరకూ, నవంబరు 19 వరకూ రూ. 4వేలుగా పరిమితి విధించారు.

నవంబరు 10 నుంచి అన్ని కార్పొరేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, సొసైటీలు ట్రస్టులు వారి వద్ద ఉన్న డబ్బును ఆర్‌బీఐ, బ్యాంకు, పోస్టాఫీసు కార్యాలయాల్లో క్రెడిట్ చేయవచ్చు. పెద్ద నోట్లను మార్చుకోవచ్చు. ఈ ఏర్పాట్లన్నీ నకిలీ కరెన్సీని అడ్డుకోవడంతో పాటు, టెర్రరిజానికి అందుతున్న డబ్బులను కట్టడి చేసేందుకు అని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. నవంబరు 9 నుంచి నవంబరు 24 వరకూ సైతం బ్యాంకు ఖాతాల నుంచి విత్‌డ్రా చేసే డబ్బుపై పరిమితులను విధించారు. ఒక్కో రోజుకు గరిష్టంగా రూ. 10 వేల వరకూ మొత్తం ఒక్కో వారం రోజుల్లో రూ. 20 వేలకు మించకుండా విత్‌డ్రా చేసుకునే విధంగా ప్రభుత్వం అనుమతించింది.


Click it and Unblock the Notifications