న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ క‌రెన్సీపై మోడీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌

ప్ర‌ధాన‌మంత్రి సంచ‌ల‌నాత్మ‌క ప్ర‌క‌ట‌న చేశారు. దేశ‌వ్యాప్తంగా ఈరోజు అర్ధ‌రాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు చెప్పారు. అయితే ఈ రూ. 500, 1000 నోట్ల‌కు కొన్ని మిన‌హాయింపుల‌నిచ్

దేశ‌వ్యాప్తంగా న‌వంబ‌రు 8 అర్ధ‌రాత్రి నుంచి రూ. 500, రూ. 1000 నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌క‌టించారు. అయితే ఈ రూ. 500, 1000 నోట్ల‌కు కొన్ని మిన‌హాయింపుల‌నిచ్చారు. న‌ల్ల‌ధనాన్ని క‌ట్ట‌డి చేసేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెలువ‌రించారు. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల వ‌ద్ద ఉన్న రూ. 500, రూ. 1000 నోట్ల‌ను పోస్టాఫీసు, బ్యాంకుల వ‌ద్ద మార్పిడి చేసుకునేందుకు డిసెంబ‌రు 30 వ‌ర‌కూ అవ‌కాశ‌మిచ్చారు. ఈ నేప‌థ్యంలో ఈ డెవ‌ల‌ప్‌మెంట్‌కు సంబంధించిన ప‌లు అంశాల‌ను తెలుసుకుందాం.

న‌ల్ల‌ధ‌నం క‌ట్ట‌డికై

న‌ల్ల‌ధ‌నం క‌ట్ట‌డికై

గ‌త రెండేళ్ల‌లో న‌ల్ల‌ధ‌నం క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకుంది. ఇందుకోసం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని(సిట్‌ను) నియ‌మించారు. అంతే కాకుండా వెల్ల‌డించని ఆస్తుల‌ను స్వ‌చ్చందంగా వెల్ల‌డించేందుకు అవ‌కాశ‌మిచ్చారు. మారిష‌ష్‌, సైప్ర‌స్ దేశాల‌తో ఉన్న డ‌బుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ ఒప్పందానికి ప‌లు స‌వ‌ర‌ణ‌లు చేశారు. హెచ్‌సీబీసీలో ఉన్న భార‌తీయ బ్యాంకు ఖాతా వివ‌రాల‌ను తెలుసుకునేందుకు స్విట్జ‌ర్లాండ్ ప్ర‌భుత్వంతో ఒక అంగీకారానికి వ‌చ్చారు.

స‌రికొత్త రూ. 500, రూ. 2000 నోట్లు

స‌రికొత్త రూ. 500, రూ. 2000 నోట్లు

ప్రస్తుతం ఉన్న 500, 1000 రూపాయల నోట్లు రద్దయిన నేపథ్యంలో వాటి స్థానంలో సరికొత్త రీతిలో అన్ని రకాల భద్రతా ప్రమాణాలతో కొత్త 2000 రూపాయల, 500 రూపాయల నోట్లను రిజర్వు బ్యాంకు విడుదల చేయబోతోంది. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మంగళవారం ఈ కొత్త నోట్ల నమూనాను మీడియాకు విడుదల చేశారు. నవంబర్ 10 నుంచే అధికారికంగా ఈ నోట్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్ర‌క‌టించారు. కొత్త నోట్లను అంధులు సైతం గుర్తించగలిగే లక్షణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ నకిలీ కరెన్సీకి ఆస్కారం ఉండకుండా చేశారు. త్వరలోనే 10, 20, 100, 1000 రూపాయల కొత్త నోట్లను ముద్రిస్తారు.

పాత నోట్లు ఎక్కడెక్కడ చెల్లుతాయి

పాత నోట్లు ఎక్కడెక్కడ చెల్లుతాయి

500, 1000 కరెన్సీ నోట్ల రద్దయినప్పటికీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవి కొన్నిచోట్ల చెల్లే విధంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 12 వరకు గుర్తింపు పొందిన అన్ని పెట్రోలు బంకుల్లోనూ ఈ నోట్లు స్వీకరిస్తారు. దేశంలోకి వచ్చే లేదా ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాల్లో కూడా వీటిని అంగీకరించాలని నిర్ణయించారు. ఆసుపత్రులు, మందుల దుకాణాల్లో ఈ నెల 12 వరకు పాతనోట్లు చెల్లుబాటవుతాయి. నిర్ణీత కాల వ్యవధిలో పాతనోట్లను మార్చుకోలేకపోయిన వ్యక్తులు మార్చి 31, 2017 లోగా ప్రత్యేక ఆర్‌బిఐ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చు. అయితే ఇందుకు వీలుగా తగిన నిర్ధారణ ప్రకటనను సమర్పించాలి. వ్య‌క్తిగ‌త ధ్రువీక‌ర‌ణ కోసం వోట‌ర్ గుర్తింపు కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి వాటిని ఉప‌యోగించుకోవ‌చ్చు.

అనుమానాలుంటే ఫోన్ చేయండి

అనుమానాలుంటే ఫోన్ చేయండి

దేశంలో మంగళవారం అర్ధరాత్రి నుండి 500 రూపాయిలు, వెయ్యి రూపాయిల నోట్లు చెలామణిలో ఉండవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో దేశ ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో కేంద్రప్రభుత్వం నోట్ల రద్దుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ, రిజర్వు బ్యాంకు హెల్ప్‌లైన్ సెంటర్లను ప్రారంభించాయి. 011-23093230, 022-22602201 నెంబర్లకు ఫోన్ చేసి అనుమానాలు తొలగించుకోవచ్చని ఆర్ధిక శాఖ అధికారులు పేర్కొన్నారు.

ప్ర‌ధాని ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు

ప్ర‌ధాని ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు

*మీరు ఈ ప్ర‌భుత్వాన్ని 2014లో ఎన్నుకున్న‌ప్పుడు భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉంద‌ని ప్ర‌పంచమంతా చ‌ర్చించింది. ప్ర‌స్తుతం ఇండియాను ఎక‌న‌మిక్ స్టార్‌గా ఐఎమ్ఎఫ్‌, ప్ర‌పంచ బ్యాంకులు అభివ‌ర్ణించాయి.

*స‌బ్ కా స‌ర్కార్‌, స‌బ్ కా వికాస్- అంద‌రికీ ప‌రిపాల‌న‌, ప్ర‌గ‌తి మా ల‌క్ష్యం. పేద ప్ర‌జ‌ల సాధికార‌త కోసం మేము కృషిచేస్తున్నాం. మేము వ‌రుస‌గా ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌న్నీ ఈ దిశ‌గానే సాగాయి. ఈ ప్ర‌భుత్వం మ‌న‌ రైతుల కోస‌మే.

*అవినీతి, న‌ల్ల‌ధ‌నం ఈ దేశానికి ప‌ట్టిన రుగ్మ‌త‌లు. మ‌నం విజ‌యా‌లు సాధించ‌కుండా అవి అడ్డుప‌డుతున్నాయి.

*ఒక ప‌క్క మ‌నం ఎంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఉన్నామో, అంత‌ర్జాతీయ అవినీతిలో ముందు వ‌రుస‌లో ఉన్నాం.

* రూ. 1.25 ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నం రిక‌వ‌ర్ అయింది.

పెద్ద‌మొత్తంలో క‌రెన్సీ వృథా

పెద్ద‌మొత్తంలో క‌రెన్సీ వృథా

అనూహ్య నిర్ణ‌యంతో దేశ‌వ్యాప్తంగా పెద్దఎత్తున చెలామ‌ణీలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్ల‌న్నీ వృథా అవుతాయి. వీటిని ముద్రించేందుకు ఎంతో ఖ‌ర్చు అయి ఉంటుంది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం మ‌ళ్లీ నూత‌న నోట్ల ముద్ర‌ణ‌కు ఖ‌ర్చుపెట్టాల్సి ఉంటుంద‌ని విమ‌ర్శ‌కులు వాదిస్తున్నారు.

రూ. 14 ల‌క్ష‌ల కోట్లా?

రూ. 14 ల‌క్ష‌ల కోట్లా?

న‌ల్ల‌ధ‌నం, వెల్ల‌డి కాని డ‌బ్బును క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా రూ.14 ల‌క్షల కోట్ల కరెన్సీపై ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా. ప్ర‌స్తుతం ప్ర‌జల వ‌ద్ద చెలామ‌ణీలో ఉన్న రూ. 500 నోట్ల విలువ రూ. 7.85 ల‌క్ష‌ల కోట్లుగాను, రూ. 1000 నోట్ల విలువ రూ. 6.33 ల‌క్ష‌ల కోట్లుగాను ఉంటుంద‌ని ఆర్‌బీఐ లెక్క‌ల ద్వారా తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+