సోమవారం ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 184.84 పాయింట్ల లాభంతో 27,458.99 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 8,500 పాయింట్ల మార్కును చేరుకోలేకపోయింది.
సోమవారం ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 184.84 పాయింట్ల లాభంతో 27,458.99 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 8,500 పాయింట్ల మార్కును చేరుకోలేకపోయింది. చివరకు 63.30 పాయింట్లు లాభపడి 8,497.05 వద్ద ముగిసింది.
లుపిన్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బీహెచ్‌ఈఎల్, ఐటీసీ షేర్లు లాభపడగా, టీసీఎస్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సానుకూలంగా ఉంటాయన్న సంకేతాలు మార్కెట్‌కు కలిసి వచ్చాయి. ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి ఎఫ్‌బీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించినట్లు ట్రేడింగ్ వర్గాలు చెబుతున్నాయి.

లుపిన్ గోవా ప్లాంట్‌కు యూఎస్ఎఫ్‌డీఏ మార్గం సుగమం చేయడంతో ఆ కంపెనీ షేర్ 7 శాతం పెరిగింది. బ్యాంకు త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించడంతో పీఎన్‌బీ షేర్ సైతం బాగా లాభపడింది. ఇవి రెండే కాకుండా హిందాల్కో, ఐటీసీ, ఐసీఐసీఐ లాభపడిన వాటిలో ఉన్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో నష్టపోయిన వాటిలో జీపీపీఎల్,ట్యూబ్ఇన్వెస్ట్,ర్యాలీస్,శ్రీసెమ్(SHREECEM), ఎస్‌జేవీఎన్ ముందున్నాయి.


Click it and Unblock the Notifications